హైదరాబాద్,డిసెంబర్14(జనంసాక్షి): నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఓ హస్టల్‌లో ఉంటున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సాయితేజ(23) అనే యువకుడు వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఉద్యోగం రావట్లేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
హాస్టల్లో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య