బెంగళూరు,డిసెంబర్19 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)దేశరాజధాని నగరం ఢిల్లీతోపాటు వివిధ రాష్టాల్ల్రో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం యడియూరప్ప మాట్లాడుతూ..సీఏఏ అంశంపై రాజకీయ పార్టీలు, నేతలు, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. సీఏఏతో దేశప్రజలకు ఎలాంటి నష్టంకానీ, ముప్పుకానీ ఉండబోదన్నారు. ఈ చట్టం కేవలం ఇతర దేశాల నుంచి ఇక్కడికొచ్చి..భారత పౌరసత్వం కోరుకునే వారి కోసం మాత్రమేనని యడియూరప్ప అన్నారు. సీఏఏపై బెంగళూరులో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు సంయమనంతో వ్యవహరించి లాఠీఛార్జీ ఏం చేయకూడదని సీఎం యడియూరప్ప ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది.
పౌరచట్టపై సంయమనం అవసరం: యెడ్యూరప్ప