ఈశాన్య రాష్టాల్ల్రో.. కాంగ్రెస్‌ నిప్పు పెడుతుంది


- కాంగ్రెస్‌ పార్టీ ప్రకటనలతో ప్రజలు తప్పుదోవ పట్టొద్దు
- రాష్టాల్ర అభివృద్ధికి కేంద్రం పనిచేస్తుంది
- జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ
రాంచీ, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : దేశంలోని ఈశాన్య రాష్టాల్ల్రో కాంగ్రెస్‌ పార్టీ నిప్పు పెడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. గురువారం జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధన్‌బాద్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రేరేపణలతో భారత పౌరసత్వ(సవరణ) బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్టాల్ర ప్రజలు ఆగ్రహంతో నిరసనలు వ్యక్తం 
చేస్తున్నారు. ఈ బిల్లును కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోందన్నారు. ఈశాన్య రాష్టాల్ల్రోని ప్రతిఒక్కరికి భరోసా ఇస్తున్నారన్నారు. ఈ బిల్లు ఆమోదం వల్ల అసోం, ఇతర రాష్టాల్ర సంప్రదాయాలు, సంస్కృతి, భాషతో పాటు ఇతర వాటికి ఎలాంటి భంగం కలగదన్నారు. ఈ రాష్టాల్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుందని మోదీ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటనలతో ప్రజలు తప్పుదోవ పట్టొద్దు అని మోదీ విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని నమ్ముతున్నారు. ఇచ్చిన హావిూలను బీజేపీ నెరవేర్చడం వల్లే ప్రజలకు తమ పార్టీపై నమ్మకం కుదురుతుందన్నారు మోదీ. భారతీయ జనతా పార్టీ అయోధ్య అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించగలిగింది. అయోధ్యపై కాంగ్రెస్‌ వివాదం సృష్టించిందే తప్ప ఆ సమస్యను పరిష్కరించలేకపోయిందని మోదీ అన్నారు. రామమందిరం నిర్మాణానికి తాము ఓ మార్గాన్ని చూపించామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో మైనార్టీ శరణార్ధులకు సరైన రక్షణ కల్పించలేదన్నారు. దేశంలోని శరణార్థుల పరిస్థితి పాకిస్థాన్‌లో ఉంటున్న శరణార్ధుల మాదిరి కాంగ్రెస్‌ హయాంలో ఉండేదని మోదీ అన్నారు. మైనార్టీ శరణార్థుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ గత కొన్నేళ్లుగా చెప్పుకొస్తుందని, కానీ వారికోసం ఆ పార్టీ చేసిందేమి లేదన్నారు. పౌరసత్వ సవరణ బిల్లు కారణంగా ఈశాన్య రాష్టాల్రకు ఎటువంటి నష్టం వాటిల్లదని, అసోంతో పాటు ఇతర రాష్టాల్ర సంస్కృతి సంప్రదాయాలు, భాషతో పాటు ఇతర ఏ విషయాలపైనా క్యాబ్‌ ప్రభావం ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కోసమే కేంద్రం పనిచేస్తుంది. కాంగ్రెస్‌ ప్రకటనలతో తప్పుదారి పట్టొద్దు. ఈశాన్య రాష్టాల్ల్రో అలజడులు సృష్టించేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారని మోదీ తెలిపారు.