జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు.

వికారాబాద్ జిల్లా ఎస్పి  ఎం.నారాయణ 


వికారాబాద్ ,తాండూర్ జనవరి 24( జనం సాక్షి

జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎస్పీ  ఎం. నారాయణ తెలిపారు. శనివారం
 మున్సిపల్ ప్రాంతాలలో ఎలెక్షన్ కౌటింగ్ ఉన్నందున వికారాబాద్ జిల్లా లోని అన్ని మున్సిపల్ ప్రాంతాలు అయిన వికారాబాద్, తాండూర్,పరిగి మరియు కోడంగల్ లలో 144 సెక్షన్ అమలులో ఉంటుందిని తెలిపారు. ప్రజలు గుంపులు గుంపులుగా గుమికుడి ఉండవద్దు అని సూచించారు.జిల్లా లో ఎటువంటి విజయోత్సవా ర్యాలీలు (జూలూస్) ఎట్టి పరిస్థితులలో తీయరాదన్నారు.  బాణాసంచా కాల్చుటకు ఏట్టి పరిస్థితిలో అనుమతి లేదన్నారు. గుర్తింపు కార్డ్ ఉన్న వ్యక్తులకు మాత్రమే  కౌంటింగ్ సెంటర్ లోకి అనుమతి ఉంటుంది అని పేర్కొన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడినట్లు అయితే వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది హెచ్చరించారు  జిల్లా ప్రజలు జిల్లా పోలీస్ అధికారులకు సహకరించగలరని ఆయన విజ్ఞప్తి చేశారు.