పట్టణ పోరులో యువత ఆసక్తి

ఉత్సాహంగా ప్రచార ఏర్పాట్లు


కామారెడ్డి,జనవరి2(జనంసాక్షి):   ఎన్నడూ లేని విధంగా ఈసారి మున్సిపల్‌ ఎన్నికల్లో యువకులు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మహిళలరు రిజర్వ్‌ అయితే తమ భార్యలను లేదా తమ ఇంటి ఆడవారిని రంగంలోకి దింపేందుకు చాపకింద నీరుల ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళలకు కేటాయించిన స్థానాల్లో భార్యలను దింపి గెలిపించుకునేందుకు భర్తలు ఇప్పటికే రంగంలోకి దిగడంతో మున్సిపల్‌ పోరు రసవత్తరంగా మారనుది. అసెంబ్లీ ఎన్నికలలో మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ సానూబూతి పరుడిగా పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చోటా, మోటా నాయకులను మచ్చిక చేసుకుంటూ వారిద్వారా ఎమ్మెల్యేలను ఒప్పించే ప్రయత్నాల్లో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఎన్నికల నియమావాళిని అనుసరిస్తూ ఎన్నికల సంఘం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. వీటిని ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలకు ఆదేశాలు 


జారీ చేసింది.  అభ్యర్థులను బెదిరించినా, ఎత్తుకెళ్లినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ దొరికినా ఏడాది జైలుశిక్ష, జరిమానా విధించడంతో పాటు ఆరేండ్లు ఎలాంటి పదవులకు పోటీ చేయకుండా అనర్హత వేటు వేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. రానున్న  మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించేలా కౌన్సిలర్లను గెలిపించుకోవాలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. వీలైనన్ని ఏకగ్రీవాలకు ప్రయత్నించి పట్టణాల అభివృద్దికి పాటుపడాలన్నారు. కార్యకర్తలంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పని చేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. పద్నాలుగు సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్టాన్న్రి సాధించుకోవడం జరిగిందన్నారు. ఇందుకు కెసిఆర్‌కు అండగా నిలిచి ప్రతి ఒక్కరూ పంచాయితీ ఎన్నికలను ప్రతిష్టా తీసుకోవాలన్నారు. రాష్టాన్న్రి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగడం జరుగుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివద్ధి పనులే  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల గెలుపునకు దోహదపడ్డాయని అన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పాలనను ప్రజలకు అందించేలా అందరం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.