ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం

తండ్రీ, కూతరు మృతి: ప్రాణాపాయంలో భార్య


వనపర్తి,జనవరి2 (జనం సాక్షి) : ఒకే ఇంట్లో తల్లీ, తండ్రి, కూతురు ముగ్గురూ పెట్రోల్‌ పేసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సమస్యల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.  చిన్నంబావి మండలం, అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన బడికల జయన్న కుటుంబ సభ్యులు ముగ్గురు.. బుధవారం రాత్రి 10 గంటలకు తమ ఇంట్లో పెట్రోల్‌ పేసుకొని నిప్పంట్టించు కున్నారు. విషయం గమనించిన స్థానికులు.. అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు.. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. జయన్న(40), ఆయన కూతురు గాయత్రి(17) మరణించారు. జయన్న భార్య వరలక్ష్మీ ప్రాణాపాయ స్థితిలో ఉంది. చనిపోయిన ఇద్దరి మృతదేహాలను ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.