తెంగాణలో ఆగని కరోనా


పెరుగుతున్న కేసులతో గ్రేటర్‌లో ఆందోళన
హైదరాబాద్‌,జూన్‌24(జ‌నంసాక్షి):రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. కేసు సంఖ్య పది వేకు చేరువైంది. వారం రోజుగా రికార్డు స్థాయిలో కేసు నమోదవుతున్నయి. మంగళవారం 879 మందికి వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. ఇందులో గ్రేటర్‌ హై దరాబాద్‌లోనే 652 కేసు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. మేడ్చల్‌ జిల్లాలో మంగళవారం ఒక్కరోజే అత్యధికంగా 112 కేసు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 64, వరంగల్‌ రూరల్‌ లో 14, కామారెడ్డిలో 10, వరంగల్‌ అర్బన్‌ లో 9, జనగామలో 7, సంగారెడ్డిలో 2, మంచిర్యాలో 2, మహబూబాబాద్‌ లో 2, మెదక్‌ లో ఒకటి, నాగర్‌ కర్నూల్లో 4 కేసు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితు సంఖ్య 9,553కు పెరిగింది. ఇందులో 4,224 మంది వైరస్‌ నుంచి కోుకోగా, 5,109 ఆక్టివ్‌ కేసు ఉన్నట్టు పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో పనిచేసే మార్షల్‌ ఎ. జనార్థన్‌ కు కరోనా గా నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికాయి ఆయనతో కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ నె 18 నుంచి 20 వరకు ఆయనతోపాటు డ్యూటీలో ఉన్న మార్షల్స్‌ వివరాు సేకరించారు. కాగా, కరీంనగర్‌ జిల్లా ఇ్లంతకుంట మండం మల్యాలో ఒకే కుటుంబంలో ముగ్గురికి వైరస్‌ పాజిటివ్‌ గా తేలింది. నాగర్‌ కర్నూల్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న స్టాఫ్‌ నర్స్‌, వార్డు బాయ్‌ కి కరోనా పాజిటివ్‌ నిర్దారణ
అయ్యింది. దీంతో హాస్పిటల్‌ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. కరోనాతో మంగళవారం మరో ముగ్గురు చనిపోయారని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మరణా సంఖ్య 220కి పెరిగింది. మృతు వివరాను ప్రభుత్వం వ్లెడిరచలేదు. రాష్ట్రంలో టెస్ట్‌ చేపించుకుంటున్న ప్రతి నుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వస్తోంది. రాష్ట్రంలో మొత్తం టెస్టు సంఖ్య 63,249 కు చేరింది.