దిల్లీ,జూన్5(జనంసాక్షి): పంజాబ్ మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ పార్టీ మారనున్నారనే ఊహాగానాు ఇప్పటికే ఊపందుకున్నాయి. ‘ఆయన వస్తే సాదరంగా స్వాగతిస్తాం’ అంటూ తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యు ఆ ఊహాగానాకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ మేరకు ఎన్నిక వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో సంప్రదింపు కూడా జరుపుతున్నట్లు దిల్లీ వర్గాల్లో చర్చు నడుస్తున్నాయి.తొుత భాజపాలో ఉన్న సిద్దూ 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక నాటికి కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో విజయం సాధించి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతు నిర్వర్తించారు. తదనంతర కాంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో విభేదాు తలెత్తాయి. దీంతో గత కొంత కాం నుంచి పార్టీతో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏడాది క్రితమే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే సార్వత్రిక ఎన్నికకు ముందే ఆప్ నుంచి ఆఫర్ అందింది. ఈ ఏడాది మార్చిలోనూ ఆమ్ ఆద్మీ పంజాబ్ కన్వీనర్ భగవంత్ మన్.. సిద్దూని పార్టీలోకి ఆహ్వానించారు.2017 పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సిద్దూ విజయానికి కారణమైన ప్రశాంత్ కిశోర్.. 2020 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌తో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనే.. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు తొస్తోంది.
‘ఆప్’ వైపు సిద్ధూ చూపు