అమరావతి,అక్టోబర్5(జనంసాక్షి): రాజధాని మార్పునకు సంబంధించిన కేసులపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం నుంచి నుంచి రోజువారీ విచారణ చేయాలని నిర్ణయించింది. రాజధాని మార్పుపై మొత్తం 229 అనుబంధ పిటిషన్లు ఉన్నట్లు తెలిపింది. పిటిషన్లను అంశాల వారీగా విభజించినట్లు హైకోర్టు వెల్లడించింది.
అమరావతి మార్పు నేటినుంచి రోజువారీ విచారణ