ఎల్‌ఆర్‌ఎస్‌ను కట్టాల్సిన పనిలేదు
కెసిఆర్ ప్రబుత్వం శాశ్వతం కాదు
పన్నుల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చే పనిలో కెసిఆర్
ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో డబ్బులు గుంజే యత్నాలు
మండిపడ్డి భట్టి తదితర కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్,అక్టోబర్5(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చే పనిలో ఉందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పేదలు రూపాయి రుపాయి పోగేసి కొన్న ప్లాట్లను ఎల్‌ఆర్‌ఎస్ కట్టకపోతే రిజిస్టేష్రన్ చేయమని బెదిరిస్తున్నారని... ప్రభుత్వం క్రమబద్ధీకరించాలి కానీ ఆస్తుల్లో వాటా కొల్లగొట్టడం సబబు కాదని అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ పై ఎవరూ ఆందోళన వద్దని, కేసీఆర్ శాశ్వతం కాదని సోమవారం నాడిక్కడ విూడియతో అన్నారు. ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం లోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎల్‌ఆర్‌ఎస్ డీలింక్ చేస్తామన్నారు. అప్పుల భారం ప్రజలపై ఇప్పుడే మొదలైందన్నారు. 2-3ఏళ్లలో అప్పుల భారం ఎలా ఉంటుందోనని భయంగా ఉందన్నారు. వీలైతే ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించవద్దన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రజలకు వెసులుబాటు కల్పించేలా ఉండాలన్నారు. పన్నులతో ప్రజలను పీడించే వ్యవస్థ మొదలైందన్నారు. నిజాం కాలంలో పంట కంటే శిస్తు ఎక్కువ వేసేవారన్నారు. తెలంగాణలో మళ్లీ వెట్టి పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. నిరంకుశంగా ప్రజలను పీడించే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ప్లాట్ రిజిస్టేష్రన్ చేసినప్పుడు ఫీజు తీసుకున్నది ప్రభుత్వం కదా.. మళ్ళీ ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు ఎందుకు అని ప్రశ్నించారు. తెచ్చిన అప్పులు తీర్చడానికి ప్రజలపై భారం వేస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని.. ఎవరూ భయపడొద్దని భరోసా ఇచ్చారు. ఎల్‌ఆర్‌ఎస్ కట్టొద్దని.. తాము అధికారంలోకి వచ్చాక అందరికి న్యాయం చేస్తామని హావిూ ఇచ్చారు. రీ రెగ్యులరైజ్ చేస్తామని తెలిపారు. కేసీఆర్ శాశ్వతం కాదని చెప్పారు. ఆస్తుల ఆన్‌లైన్ పేరుతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. గ్రామాల్లో ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఎవరూ భయపడొద్దని.. తాము అండగా ఉంటామని... కేసీఆర్ ప్రభుత్వాన్ని దించాలని భట్టి విక్రమార్క తెలిపారు. ఇదిలావుంటే ప్రజలపై భారం వేయడానికే కేసీఆర్ ఆస్తుల సర్వే చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. ప్రజల దగ్గరకు వెళ్లినప్పుడు టీఆర్‌ఎస్‌కు తిరుగుబాటు తప్పదన్నారు. ఎల్‌ఆర్‌ఎస్, ఆస్తుల సర్వేతో ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నారన్నారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 131, 135 జీవోలు కూడా ప్రజలను దోచుకోవడానికేనని కాంగ్రెస్ నేత వీహెచ్ పేర్కొన్నారు. కరోనా సమయంలో డబ్బులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని...ఎల్‌ఆర్‌ఎస్ కట్టాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్ ప్రభుత్వపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి విమర్శలు చేసారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫీజు లేకుండానే ఎల్‌ఆర్‌ఎస్ చేస్తుందని హావిూ ఇచ్చారు. ఖజానా నింపుకోవడం ప్రజల జీవితాల కోసం ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. అప్పుల పాలై ప్రజలెవరూ ఎల్‌ఆర్‌ఎస్ కట్టవద్దని...టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎలా దించాలి, ఆస్తులు ఎలా కాపాడుకోవాలో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్ ఆలోచన ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చిందని నిలదీశారు. పైసా.. పైసా కూడా పెట్టి ప్లాట్ కొన్న పేదవారి కొంపలు కేసీఆర్ ముంచుతున్నారని..కేసీఆర్ చేసే సర్వే లు ఏవి సంస్కరణల కోసం కాదని ్గ/ర్ అయ్యారు. రైతుబందు పేరుతో ఐదు వేలు ఇచ్చి వెనుక నుంచి లక్ష రూపాయలు కొట్టేస్తున్నారని ఆరోపణలు చేశారు. టీఎన్జీవోల ఎన్నికలొస్తే టిఆర్‌ఎస్ కోసం మందు బాటిళ్లు పంచుతున్నారని.. వారంతా ఒకసారి ఆలోచించుకోవాలని హితువు జగ్గారెడ్డి పలికారు.