చెరువు శిఖం భూముల్లో నిర్మాణాలు గుర్తించం: ఎమ్మెల్యే

జగిత్యాల,అక్టోబర్‌5(జ‌నంసాక్షి):  ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువుల దగ్గర ఉన్న ఇళ్ల పట్టాలు చెల్లవంటూ బాంబు పేల్చారు. చెరువుల దగ్గర భవనాలు కట్టుకునేముందు ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. చెరువుల్లో భవనాలు కట్టడంవల్లే వరంగల్‌ మునిగిపోయిందన్నారు. బఫర్‌ జోన్‌లో ప్లాట్లు కొన్నవారికి ఇబ్బందుల్లేవన్నారు. అలాగే ఎవరూ చెరువులను కబ్జా చేయవద్దని సూచించారు. అలా చేస్తే ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. గతంలో చెరువుల రోణకు అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు. అయితే కొందరు చెరువు శిఖంలో భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల చెరువుల మనుగడకు ముప్పు ఏర్పడిందన్నారు. ఇలా కట్టడాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.