ధోనీకి నీకూ తేడా అదే.. 


కోహ్లీపై నెటిజన్ల విసుర్లు


ముంబై,నవంబర్‌11(( జనంసాక్షి) ): దేశం తరపున ఆడే సమయంలో వ్యక్తిగత సమస్యలను పట్టించుకోకపోవడం టీమిండియా క్రికెటర్లకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విషయంతో గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ సచిన్‌ టెండూల్కర్‌తో సహా పలువురు ప్లేయర్లు స్ఫూర్తిదాయకమైన ప్రవర్తనతో కోట్లమంది అభిమానుల హృదయాలను గెల్చుకున్నారు. అయితే తన సతీమణి, నటి అనుష్క శర్మ డెలివరీ తేదీ జనవరిలో ఉండటంతో, ప్రసవ సమయంలో ఆమెకు తోడుగా ఉండేందుకు కోహ్లీ ఆసీస్‌తో సీరీస్‌ మధ్యలో భారత్‌ వచ్చేయాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు నెటిజన్ల ట్రోలింగ్‌ వెల్లువెత్తుతోంది. కోహ్లీ అభ్యర్థనను మన్నించిన బీసీసీఐ వెంటనే  పెటర్నటీ లీవ్‌ మంజూరు చేసింది. అయితే సరిగ్గా ఈ అంశంలోనే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పేవిూ కాదని, అయితే అదే సమయంలో జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాలంటూ హితవు పలుకుతున్నారు.రంజీ ట్రోఫీ ఆడే సమయంలో తండ్రి చనిపోయినప్పటికీ ఒంటి చేత్తో జట్టును గెలిపించిన గొప్ప ఆటగాడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించిందంటున్నారు. కోహ్లీ వంటి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అందుబాటులో లేకుంటే ప్రతిష్టాత్మక సిరీస్‌లో ఓటమి తప్పదంటూ జోస్యం చెబుతున్నారు. ఆస్టేల్రియా పర్యటన మధ్యలోనే కోహ్లీ స్వదేశానికి తిరిగి రానున్నట్లు బీసీసీఐ వెల్లడించినప్పటినుంచి కోహ్లీపై నెటిజన్ల విసుర్లు ఎక్కువయ్యాయి. ఈ అంశంలో గతంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ వ్యవహరించిన తీరును పోలిక తెస్తూ నెచటిజన్లు కోహ్లీని విమర్శిస్తున్నారు. దేశం తరఫున ఆడటం కంటే వ్యక్తిగత విషయాలకే కోహ్లీ ప్రాధాన్యం ఇస్తున్నాడని, కానీ ధోని మాత్రం జీవా జన్మించిన సమయంలో భార్యాపిల్లలను వదిలి జట్టును ముందుకు నడిపించడంపై దష్టి సారించాడని పేర్కొంటున్నారు. 2015 ప్రపంచకప్‌ టోర్నీ జరుగుతున్న సమయంలో ధోని సతీమణి సాక్షి జీవాకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆస్టేల్రియాతో టీమిండియా ఫైనల్‌ వార్మప్‌ మ్యాచ్‌కు రెరడు రోజుల ముందు ఫిబ్రవరి 6న జీవా జన్మించింది. ఆ సమయంలో..ఇండియాలో ఉండకపోవడం వల్ల విూరు విూ తొలి సంతానానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలకు దూరమవుతున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. అదేం లేదు. ప్రస్తుతం నేను దేశం తరఫున జాతీయ జట్టును ముందుకు నడిపించే బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాను. వేరే విషయాల గురించి అంతగా ఆలోచించడం లేదు. ప్రపంచకప్‌ ఆడటం చాలా ముఖ్యం అంటూ ధోనీ సమాధానమిచ్చాడు. గతంలో రంజీ మ్యాచ్‌ సందర్భంగా తన తండ్రి చనిపోయినపుడు కూడా జట్టును గెలిపించేందుకు బాధను పంటిబిగువన భరించిన కో/-లహి, ఇప్పుడు మాత్రం ఎందుకో అలా ఆలోచించలేకపోతున్నాడు. అతడి నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. ధోని మాత్రం ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. జీవాను చూసేందుకు ఇండియాకు రాలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన కామెంటేటర్‌ హర్షా బోగ్లే.. బాగుంది.. ఇదొక పెద్ద వార్తే. ఆస్టేల్రియాలో తొలి టెస్టు తర్వాత, తన బిడ్డను చూసుకునేందుకు కో/-లహి ఇండియాకు వస్తున్నాడు. మోడర్న్‌ ప్లేయర్‌కి ప్రొఫెషన్‌తో పాటు వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ముఖ్యమే. అయితే కో/-లహి లేకుంటే జట్టు కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ట్వీట్‌ చేశాడు. కోహ్లీ అభిమానులు మాత్రం అతడి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, కాబోయే తల్లిదండ్రులకు ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నారు.


కోహ్లీ  లేకపోతే సీరీస్‌ కళ తప్పదా? ఆస్టేల్రియాతో మూడు టెస్ట్‌లకు విరాట్‌ కో/-లహీ దూరం కావడం నిరాశపరుస్తోందని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా అన్నాడు. అతడి పరోక్షంలో టెస్ట్‌ సిరీస్‌ కళ తప్పుతుందని అభిప్రాయ పడ్డాడు. అనుష్క శర్మ జనవరి మొదటి వారంలో బిడ్డకు జన్మనివ్వనుంది. దాంతో అడిలైడ్‌లో జరిగే తొలి టెస్ట్‌ అనంతరం విరాట్‌ స్వదేశం వెళ్లనున్న సంగతి తెలిసిందే. స్టీవ్‌ వా దీన్ని ప్రస్తావిస్తూ.. కోహ్లీ పూర్తి సిరీస్‌కు అందుబాటులో లేకపోవడం నన్ను నిరాశకు గురి చేసింది. అంతేకాదు అతడి నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది అని వ్యాఖ్యానించాడు. క్రికెట్‌లో విరాట్‌ ఇప్పటికే ఎన్నో ఘనతలు అందుకున్నా అతడి కెరీర్‌లో ఈ సిరీస్‌ అతి కీలకమైనది.