దేశంలో 94 శాతానికి రికవరీ రేటు
కొత్తగా 2,427 మంది మృత్యువాతరాష్ట్రాల్లో కఠిన నిబంధనలతో తగ్గుతున్న కేసులు
ఢల్లీిలో లాక్‌డౌన్ సడలింపులతో తెరుచుకున్న దుకాణాలు
50శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న మెట్రో రైళ్లు
న్యూఢల్లీి,జూన్7(జనం సాక్షి): దేశంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వివిద రాష్ట్రాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్, కర్ఫ్యూలా కారణంగా కేసులు తగ్గుతున్నాయి. కొత్త కేసులు, మరణాల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా లక్షకు దిగొచ్చిన రోజూవారీ కేసులు.. సుమారు రెండు నెలల కనిష్ఠానికి చేరడం ఊరట కలిగిస్తోంది. ఇక రికవరీ రేటు 94శాతానికి చేరువైంది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడిరచింది. తాజాగా 1,00,636 మందికి కరోనా సోకింది. క్రితం రోజుతో పోల్చితే 12 శాతం తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 2,427 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 2,89,09,975 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలగా.. 3,49,186 మంది మహమ్మారికి బలయ్యారు. నిన్న 15,87,589 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఇక రికవరీలు 2.7కోట్ల మార్కును దాటాయి. నిన్న ఒక్కరోజే 1,74,399 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 94 శాతానికి చేరువ కాగా.. క్రియాశీల రేటు 5శాతం దిగువకు నమోదైంది. ప్రస్తుతం 14,01,609 మంది కొవిడ్‌తో బాధపడు తున్నారు. మరోవైపు ఆదివారం 13.90లక్షల మందికి టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 23 కోట్లకు పైబడిరది. కోవిడ్ కేసుల కన్నా డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల క్రియాశీలక కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం దేశంలో 14,01,609 యాక్టివ్
కేసులున్నాయి. గత 24 గంటల్లో తమిళనాడు 20,421 కేసులు నమోదు కాగా, కేరళలో 14,672, మహారాష్ట్రలో 12,557 కేసులు, కర్ణాటకలో 12,209, ఆంధప్రదేశ్‌లో 8,976 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 23 కోట్ల వ్యాక్సిన్లు వినియోగం అయ్యాయి. ఇకపోతే గత నెలన్నరగా ఢల్లీిలో లాక్‌డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో లాక్‌డౌన్‌ను అమలు చేశారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు గణనీయంగా తగ్గాయి. వందల సంఖ్యలో నమోదవు తున్నాయి. దీంతో ఢల్లీిలో 50 శాతం కెపాసిటీతో అనుమతులు మంజూరు చేశారు. ఉదయం నుంచి మెట్రో రైళ్లు 50 శాతం మంది ప్రయాణికు లతో పరుగులు తీస్తున్నాయి. 50 శాతం దుకాణాలు తెరుచుకున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేం దుకు అమలు చేసిన సరి`బేసి విధానాన్ని ఇప్పుడు అన్‌లాక్ విషయంలో కూడా అమలు చేస్తున్నారు. నిత్యం రద్ధీగా ఉండే కరోల్‌బాగ్, పాత ఢల్లీి ఏరియాలు తిరిగి సందడిగా మారాయి. అన్‌లాక్ పక్రియ మొదలైనప్పటికీ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు చెబుతున్నారు.