కమలాహ్యారిస్ విమానంలో సాకేతిక లోపం
అత్యవసరంగా మరో విమానంలో విదేశీ పర్యటనవాషింగ్టన్,జూన్7(జనం సాక్షి):అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌కు ప్రమాదం తప్పింది. గ్వాటిమాల పర్యటనకు వెళ్లేందుకు ఆమె ఎయిర్‌ఫోర్స్ విమానం ఎక్కారు. ఈ క్రమంలో టేకాఫ్ అయిన కాసేపటికే కమలాహారిస్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో విమానం అత్యవసరంగా ల్యాండైంది. అనంతరం కమలాహారిస్ మరో విమానంలో గ్వాటిమాల పర్యటనకు వెళ్లారు. అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె తొలిసారిగా విదేశీ పర్యటనకు బయల్దేరగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కమలా హ్యారిస్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండైంది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా తన తొలి అంతర్జాతీయ పర్యటనలో భాగంగా గ్వాటెమాలాకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. టాకాఫ్ అయిన కాసేపటికే సమస్య రావడంతో అది తిరిగి వాషింగ్టన్‌లో జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు వచ్చింది. విమానం నుంచి దిగగానే.. తాను బాగానే ఉన్నట్లు కమలా రిపోర్టర్లకు చెప్పారు. ఆ వెంటనే ఆమె మరో విమానంలో గ్వాటెమాలాకు వెళ్లారు. కమలా హ్యారిస్ ప్రయాణిస్తున్న విమానంలో ల్యాండిరగ్ గేర్ సమస్య తలెత్తినట్లు సిబ్బంది చెప్పారు. అత్యవసరంగా వచ్చిన ముప్పేవిూ లేకపోయినా.. ముందు జాగ్రత్తగా తాము విమానాన్ని ల్యాండ్ చేసినట్లు తెలిపారు. ఎయిర్ ఫోర్స్ టూగా పిలిచే ఈ విమానంలో ఏదో శబ్దం వచ్చినట్లు అందులో ప్రయాణిస్తున్న ఓ జర్నలిస్ట్ చెప్పాడు.