రాగల మూడురోజుల్లో మోస్తరు వర్షాలు


 

తెలంగాణలో అక్కడక్కడా కురిసిన వానలు

హైదరాబాద్‌ సహా పలుప్రాంతాల్లో జల్లులు
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
కామారెడ్డి జిల్లాలో వాగులో చిక్కుకున్న వారు క్షేమం
హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): రాగల మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోకి పశ్చిమ, నైరుతి నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. గురు, శుక్రవారాల్లో తేటికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని, శనివారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మూడు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని చెప్పింది. ఇదిలా ఉండగా.. గురువారం ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లోనూ వర్షం పడిరది. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా కోటగిరిలో 141 మిల్లీవిూటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్‌, హనుమకొండ, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో అక్కక్కడ భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైందని టీఎస్‌ డీపీఎస్‌ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. గురువారం తెల్లవారు జామున యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు, గుండాల మండలాల్లో, నల్లగొండ జిల్లాలోని కనగల్‌, తిప్పర్తి, చండూరు, మునుగోడు, దేవరకొండ, సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు మండలాల్లో కుండపోతగా వాన పడిరది. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ మోస్తు వర్షం నమోదయింది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. హయత్‌నగర్‌, ఎల్బీ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌, బేగంపేట్‌, సికింద్రాబాద్‌లో వర్షం పడిరది. కోఠి, నాంపల్లి, మాసబ్‌ ట్యాంక్‌, బంజారా హిల్స్‌, బోయిన్‌పల్లి, బాలానగర్‌, మూసాపెట్‌, ఎర్రగడ్డలో భారీగా వాన పడిరది. దీంతో వర్షపు నీరు లోతట్టు ప్రాంతల్లోకి చేరింది. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంతోపాటు మహారాష్ట్ర, కర్నాటకలో భారీగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జుక్కల్‌ మండలం, హంగార్గా గ్రామ శివారులో ఉన్న వాగుకు భారీగా వరద నీరు రావడంతో వాగు అవతలవైపు పొలం పనులకు వెళ్లిన కూలీలు అక్కడే చిక్కుకున్నారు. అకస్మాత్తుగా వాగుకు భారీగా వరద రావడంతో 8 మంది కూలీలు పంటపొలంలో ఉన్న షెడ్డులో తలదాచుకున్నారు. వరదకు అవతలివైపు ఉన్న ఓ వ్యక్తి డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తాడు సహయంతో కూలీలను రక్షించారు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు డ్యామ్‌లోకి ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం డ్యామ్‌కు ఇన్‌ఎª`లో 21,580 క్యూసెక్కులు, ఔట్‌ ప్లో 3,500గా ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1090 అడుగుల నీరుంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 90.31 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ ఇన్‌ ఎª`లో 20,004 క్యూసెక్కులుగా ఉండగా ఔట్‌ ఎª`లో 20,004 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 19.3974 టీఎంసీలుగా ఉంది.