సూర్యాపేట,సెప్టెంబర్24 (జనంసాక్షి) : జిల్లాలో అనంతగిరి మండలం శాంతినగర్ చెరువులో చేపలు పొసే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు నెలకొంది. ప్రతి ఏటా లాగానే చెరువులో చేపలు పోయడానికి దళితులకు అవకాశం ఇవ్వాలని దళితులు డిమాండ్ చేశారు. వేరే కులానికి అవకాశం ఇవ్వాలని మరో వర్గం అభ్యంతరం చేసింది. ఈ విషయంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు.ఈ ఘర్షణలో శాంతినగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసమైంది.
చెరువులో చేపలు వదిలే విషయంలో ఘర్షణ