విక్స్‌ డబ్బా మిగండంతో బాలుడు మృతి


నల్లగొండ,సెప్టెంబర్‌21(జనంసాక్షి):  నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం తొండ్లాయి గ్రామంలో విషాదం నెలకొంది. ఓ ఏడు నెలల పసికందు ఆడుకుంటూ.. తన ముందున్న విక్స్‌ డబ్బాను మింగేశాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఊపిరాడక దారిలోనే ఆ బాలుడు ప్రాణాలొదిలాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.