గుర్రపు బగ్గీపై అసెంబ్లీకి ఎమ్మెల్యేలు
అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులుకేంద్ర,రాష్ట్రప్రభుత్వ విధానాలపై మండిపడ్డ భట్టి,సీతక్క
హైదరాబాద్,సెప్టెంబర్27 (జనంసాక్షి) : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు గుర్రపు బండి విూద అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరారు. దీంతో కాంగ్రెస్ నేతలను గుర్రపు బండిపై అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇలాగే ఆసెంబ్లీకి వెళ్తామని పట్టుబట్టిన కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సితక్క, జీవన్ రెడ్డిలను అసెంబ్లీ ముందు పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు సామాన్య ప్రజలకు భారంగా మారాయన్నారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చిందన్నారు. దానికి నిరసనగా గాంధీ భవన్ నుండి గుర్రపు బండి విూద అసెంబ్లీకి వెళ్తున్నామన్నారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కేంద్ర విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టే కుట్ర కేంద్రం చేస్తుంటే.. దాన్ని సీఎం కేసీఆర్ సమర్ధిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిర్ణయం చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రధాని మోదీతో లోపాయకారి ఒప్పందాలు చేసుకుందని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఆమె విూడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీలో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు బాధపడితే ప్రభుత్వం బాగుపడదని.. సీఎం కేసీఆర్ అనేక మాయ మాటలు చెప్పారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నాయని సీతక్క మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టే కుట్ర కేంద్రం చేస్తుంటే.. దాన్ని సీఎం కేసీఆర్ సమర్ధిస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు బంద్‌లో పాల్గొంటే.. సీఎం కేసీఆర్ ఢల్లీికి పోయి మంతనాలు చేస్తున్నారని, దీన్ని రైతులు అర్థం చేసుకోవాలన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి.. జరుగుతున్న బంద్‌కు మద్దతు ఇవ్వాలని, అలాగే నల్లచట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీతక్క డిమాండ్ చేశారు.