న్యూఢల్లీి,సెప్టెంబర్27 (జనంసాక్షి) : భారత టెన్నిస్ స్టార్ సానియా విూర్జా ఈ ఏడాది తొలి టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. చెక్ రిపబ్లిక్ వేదికగా జరిగిన ఒస్టావ్రా ఓపెన్ డబ్ల్యూటీఏ`500 టోర్నీలో సానియా విూర్జా`షుయె జాంగ్ (చైనా) జంట విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ సానియా`జాంగ్ జోడీ 6`3, 6`2తో మూడో సీడ్ క్యాథెలిన్ క్రిస్టియన్ (అమెరికా)`ఎరిన్ రౌట్‌లిఫ్ (న్యూజిలాండ్) ద్వయంపై గెలుపొందింది. 64 నిమిషాల్లో ముగిసన పోరులో ఒక ఏస్ కొట్టిన సానియా జోడీ.. 3 బ్రేక్ పాయింట్లు సాధించి ప్రత్యర్థిని వరుస సెట్‌లలో చిత్తు చేసింది. కెరీర్‌లో 43వ టైటిల్ సాధించిన సానియా మాట్లాడుతూ.. ’ఈ విజయం ఎంతో ప్రత్యేకం. కెరీర్‌లో ఇది 43వ టైటిల్ కాగా.. తల్లి అయ్యాక ఇదే మొదటి డబ్ల్యూటీఏ`500 ట్రోఫీ. మ్యాచ్ ఆరంభానికి ముందు నా కుమారుడు ఇజాన్ అమ్మా ట్రోఫీ తీసుకు రా అని అన్నాడు. అతడి కోరిక నెరవేర్చినందుకు చెప్పలేనంత సంతోషంగా ఉందని చెప్పింది.
ఈ ఏడాది తొలి టైటిల్ గెలిచిన సానియా విూర్జా