మద్యం దుకాణాల రిజర్వేషన్లపై ఉత్తర్వులు
హైదరాబాద్,సెప్టెంబర్21 (జనంసాక్షి) మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రిజర్వేషన్ల అమలు కోసం మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రిజర్వేషన్లు 2021`23 నుంచి అమలులోకి రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి. ఇటీవల దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబందు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పథకంలో రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. సాయంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వ్యాపార, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే గతంలో గీత కార్మికులకు సైతం మద్యం దుకాణాల్లో 15శాతం రిజర్వేషన్లు ఇస్తామని హావిూ ఇచ్చారు. ఈ క్రమంలో ఇచ్చిన ఈ హావిూ మేరకు రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.