వాహనపూజుల చేసిన కెసిఆర్
నిజామాబాద్ జమ్మి పూజలో పాల్గొన్న కవితహైదరాబాద్,అక్టోబర్16(జనంసాక్షి ): విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు (అఓ ప్రగతి భవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు చేశారు. సంప్రదాయ బద్దంగా వాహన పూజ, అయధ పూజ ఘనంగా నిర్వహించారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో సీఎం కేసిఆర్ సతీమణి శోభ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు, శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలావుంటే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ మైదానంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బాణసంచా విన్యాసాలు ఆకట్టుకు న్నాయి. ఈ దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దసరా వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. కరోనా ప్రభావం వల్ల రావణ దహనం నిర్వహించడం లేదని తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని దుర్గాదేవిని వేడుకుందామని.. మళ్లీ సాధారణ పరిస్థితుల్లో ప్రజలు అన్ని పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. అంతకుముందు నిజామాబాద్‌లోని రామాలయంలో నిర్వహించిన జమ్మిపూజలో ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్ పాల్గొన్నారు.