రాజ్యాంగ పరిధి దాటి వ్యవహరిస్తున్నారు
బాధ్యతగల సిఎంగా హెచ్చరిస్తున్నా
హుజరాబాద్‌లో సభ పెట్టొద్దంటారా
దళితబంధును ఆపినా ఆగదని స్పష్టీకరణ
హుజూరాబాద్‌లో గెల్లు గెలుపు ఖాయమన్నకెసిఆర్
హైదరాబాద్,అక్టోబర్25 (జనంసాక్షి): కేంద్ర ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ కూడా రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తున్నదని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేశారు. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలి. గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, బాధ్యత గల పార్టీ అద్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగాభారత ఎన్నికల సంఘానికి ఒక సలహా ఇస్తున్నాను. చిల్లరమల్లర ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నానని అన్నారు. కేసీఆర్ సభ పెట్టొద్దు ఇది ఏం కథ. ఇది ఒక పద్ధతా? కొందరు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. నాగార్జున సాగర్ సభ పెట్టొద్దంటూ హైకోర్టులో కేసులు వేశారు. హుజూరాబాద్‌లో సభ నిర్వహించొద్దంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. మన పార్టీ నాయకులు చాలా మంది హుజూరాబాద్ పోరాటంలో ఉన్నారు. హుజూరాబాద్ దళితులు అదృష్టవంతులు. ఈసీ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దళితబంధు అమలు జరిగి తీరుతోంది. నవంబర్ 4 వనరకు దళిత బంధు అమలును ఆపగలదు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలిచి తీరుతాడు. గెల్లు శ్రీనివాస్‌ను హుజూరాబాద్ ప్రజలు దీవించి, ఆశీర్వదిస్తారు. రాష్ట్రమంతటా దళిత బంధును అమలు చేస్తాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ªూబోయే ఏడేండ్లలోబడ్డెట్ల ద్వారా మొత్తం రూ. 23 లక్షల కోట్లు ఖర్చు పెడుతామన్నారు. దళిత బంధుతోనే ఆగిపోం.. ఎన్నో కార్యక్రమాలు చేపడుతామన్నారు. అట్టడుగున ఉన్నందునే దళితులకు మొదట కార్యక్రమం చేపట్టాం. దళితబంధుపై పెట్టే పెట్టుబడి వృథా కాదు. దళిత బంధు రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పాటు నిస్తోందన్నారు. ఈ పథకం ద్వారా సంపద సృష్టి జరుగుతోంది. 75 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదికగా మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే
లక్ష్మారెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. మాజీ స్పీకర్ మధుసూదనచారి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత దళిత బంధుపై ప్రస్తావించగా, కేసీఆర్ స్పందించారు. దళిత బంధు కేవలం రూ. 10 లక్షలిచ్చి మమ అనే కార్యక్రమం కాదు అని సీఎం అన్నారు. దళితుల గురించి అనేక ప్రయత్నాలు జరిగాయి. మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. సర్పంచ్‌గా పని చేసిన కాలంలో సొంత గ్రామంలో 10 ఎకరాల భూమి(ఇప్పుడు రూ. 50 లక్షల విలువ) ఆరుగురు దళితులకు పంచి పెట్టారు. అలా అనేక మంది ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వాలు కూడా కొన్ని కార్యక్రమాలు అమలు చేశాయి. కానీ అనుకున్న ఫలితాలు రాలేదు. ఆశలు నెరవేరలేదు. అందువల్ల వారు సఫర్ అవుతున్నాయి. అవన్నీ ఓవర్ కమ్ కావడానికి 10 లక్షలు ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే విషయంలో.. మెడికల్, వైన్, ఫర్టిలైజర్స్ షాపులతో పాటు మొదలైన వాటిలో ఎస్సీలకు రిజర్వేషన్లు పెడుతున్నాం. రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. జబ్బు చేసినా, రోడ్డుప్రమాదం జరిగినా కూడా దళిత బంధు రక్షణ నిధి నుంచి ఖర్చు పెడుతాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ªఖఆర్‌ఎస్ ఆర్థికపరంగా కూడా శక్తివతంగా తయారైంది. టీఆర్‌ఎస్‌కు కూడా విరాళాలు సమకూరాయి. రూ. 240 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల విరాళాలు ఉన్నాయి. చట్టబద్ధమైన విరాళాల ద్వారా పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.