వందే వాల్మీకి కోకిలమ్‌ !


తిరుమల,అక్టోబర్‌20 (జనం సాక్షి) : మహా పుణ్య కవి ,రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షి కారణజన్ముడు . వాల్మీకి జీవితం ఎంతో విలక్షణమైనదని, వాల్మీకి తన జీవిత కాలంలో పాపా , పుణ్య కర్మలను ప్రక్షాళన చేశాడు , తన రామాయణ ఇతిహాసం. మానవుడు రచించిన తొలి గ్రంథము , చారిత్రక పురుషుడైన రఘురాముని గురించి ఇతని సమకాలం గురించి చెప్పడమే కాకుండా కథనం మధ్యమంగా ఆనాటి భౌగోళిక విషయాలను క్రోడీకరిం చాడు. సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కధ. దీనిని ’సీతాయాశ్చరితం మహత్‌’ అని వాల్మీకి అన్నాడు.ఈరోజు శరత్‌ పూర్ణిమ (కోజాగరాత్రి పూర్ణిమ),శరదృతువులో ఆశ్వీయుజ మాసం పౌర్ణమి నాడు ఈ పండుగగా జరుపుకుంటారు. ఈ పండగని శరత్‌`పూర్ణిమ, కొజాగరాత్రిపూర్ణిమ, కాముడిపున్నమి అని కూడా అంటారు. పౌర్ణమి అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు. పున్నమి రాత్రి వెన్నెల కురిసే వేళ కవి పుంగపుల హృదయమనే కలం నుంచి ఎన్నో మధుర కావ్యాలు జాలువారాయి. ముఖ్యంగా శరద్‌ పూర్ణిమకు ఎంతో ప్రత్యేకతో ఉంది. ఆద్యాత్మక ప్రాముఖ్యతతో పాటు అందానికి చాలా ప్రత్యేకమైనది గా భావిస్తారు. చంద్రుడు అసలైన అందం శరద్‌ పూర్ణిమ రోజు కనిపిస్తుంది. ఈ రోజు చంద్రుడు చాలా అందంగా కనిపిస్తాడు. అంతేకాకుండా రాత్రి పూట లక్ష్మీదేవి దయ మనకు లభిస్తుంది. వెన్నెల కిరణాల్లో తేనే లేదా అమృత వర్షం కురుస్తుంది అని అంటారు..