బెజవాడలో ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలు


బాలాత్రిపురసుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

విజయవాడ,అక్టోబర్‌8 (జనంసాక్షి) : నవరాత్రుల ఉత్సవాల్లో రెండో రోజు బెజవాడ కనకదుర్గమ్మ బాలా త్రిపురసుందరిగా దర్శనం ఇచ్చింది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరిదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షొడస విద్యకు ఈమే అధిష్ఠన దేవత.కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాలాత్రిపుర నామమే పరమ పవిత్రమైన నామం. త్రిపుర సుందరి అని అమ్మని పిలవడంలో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి.....అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు...ఆది దంపతులు...వారి తత్వము కుడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే ’ మనలోని మూడు అవస్థలూ...జాగృత్త్‌ , స్వప్న , సుషుప్తి!ఈ ముడు అవస్థలు ’లేద’ పురములకు బాల అధిష్ఠాన? దేవత! ఈ ముడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింప చేస్తు ....’బాలగా.’....అమ్మవారు వినొదిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తిన, ఈ ముడు అవస్థలులోనే తిరుగుతు ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది....ఆవిడ ఆత్మ స్వరూపురాలు....ఆవిడను పూజిస్తే....ఙ్ఞానము కలిగి .. ...తానె శివ స్వరూపము తో...చైతన్యము ప్రసాదించి...మోక్షమునకు...అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది...ఈ కరుణామయి.సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందరిదేవి భక్తుల పూజలు అందుకుంటోంది. ఈ రోజు రెండు నుండి పది సంవత్సరములు లోపు కలిగిన బాలికలను అమ్మవారి స్వరూపముగా పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి. అమ్మవారికి పాయసం నివేదన చెయ్యాలి.