విజయవాడ హైవేపై పోలీసుల తనిఖీలు


వాహనంలో 4కోట్ల హవాల డబ్బు పట్టివేత

నల్లగొండ,అక్టోబర్‌20  ( జనం సాక్షి ), : జిల్లాలో భారీ ఎత్తున హవాలా డబ్బు పట్టింది. హైద్రాబాద్‌`విజయవాడ హైవే పై చిట్యాల పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీలను పసిగట్టిన కారు డ్రైవర్‌, రూటు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేయబోయి పోలీసులకు దొరికిపోయాడు. కియా కారులో రూ.4 కోట్ల హవాలా డబ్బును పోలీసులు గుర్తించారు. దీంతో డబ్బుతోపాటు కారును చిట్యాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి చెన్నైకి ఈ డబ్బు తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, పట్టుబడ్డ డబ్బు ఎవరిదనేది మాత్రం పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.