పిడుగుపాటుతో ముగ్గురు మృతి

 


ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా  పిడుగులతో దద్దరిల్లింది‌. జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందగా, నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు. బజార్హత్నూర్ మండలం బుర్కపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బనియా గరన్ సింగ్ (45) , ఆశాబాయి (30) అక్కడికక్కడే మృతి చెందారు.

బండల్ నాగపూర్‌లో పిడుగుపాటుకు ఒకరు ప్రాణాలు  కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రగాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బీమ్‌పూర్ మండలం పిప్పల్ కోటిలో పిడుగుపాటు ఎద్దు ప్రాణాలు కోల్పోయింది‌.  జైనథ్ మండలం సాంగ్వి కే పిడుగుపాటుకు పదిహేను మేకలు మృతిచెందాయి.