పత్తిసాగు విస్తీర్ణంలో దేశంలో రెండో స్థానం


నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్‌ వన్‌

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి నిరంజన్‌ రెడ్డి
హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి) : నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. పత్తిసాగు విస్తీర్ణంలో దేశంలో రెండో స్థానంలో ఉన్నామని చెప్పారు. పత్తిలో తేమ శాతం, వర్షాలతో పంటనష్టంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఈసారి పత్తి సేకరణ లక్ష్యం 33.20 లక్షల మెట్రిక్‌ టన్నులని చెప్పారు. ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది రెట్టింపు పత్తి ఉత్పత్తి అవుతుందన్నారు. పత్తి కొనుగోలుకు జిన్నింగ్‌ విల్లులనే నోట్గిªడ్‌ ఏజెన్సీలుగా గుర్తింపునిచ్చామన్నారు. మార్కెట్‌లో కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉంటేనే సీసీఐ కొంటుందన్నారు. రైతులకు సబ్సిడీ విూద టార్ఫాలిన్స్‌ ఇచ్చామని చెప్పారు. కరోనా సమయంలో జిన్నింగ్‌ మిల్లులపై విద్యుత్‌ పెనాల్టీల విషయం పరిశీలనలో ఉందన్నారు. జిన్నింగ్‌ మిల్లులో జరిగే ప్రమాదాలతో రైతుకు సంబంధం ఉండదని చెప్పారు. 2016`17, 2017`18 సంవత్సరాల ఫసల్‌ బీమా యోజన ప్రీమియం చెల్లించామని తెలిపారు. ఇప్పటివరకు బీమా కోసం రూ.989 కోట్లకుపైగా ప్రీమియం చెల్లించామన్నారు. కేంద్రం తెచ్చిన పథకం వల్ల రైతుల కంటే బీమా కంపెనీలకు ఎక్కువ లబ్ది జరుగుతున్నదని విమర్శించారు. బీమా పథకం నిబంధనల్లో మార్పులు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. రైతులు అప్పు చేయకూడదనే రైతు బంధు పతకం తెచ్చామన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు.