వైసిపి నేతల తీరుపై మండిపడ్డ చింతమనేని
ఏలూరు,అక్టోబర్20(జనం సాక్షి): విూరు మాట్లాడితే సూక్తులు, తాము మాట్లాడితే బూతులా? తమ నాయకుడు ఎందుకు క్షమాపణ చెప్పాలని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు. ఆ రోజున నిండు సభలో గేలిచేస్తుంటే హా హా అంటూ నవ్వుకున్నారని అన్నారు. గౌరవ డీజీపీ విూరు తీసుకుంటున్నా జీతం ప్రజల డబ్బు అని మర్చిపోకండని చెప్పారు. ఇది మంచి పద్దతి కాదు డీజీపీ గారు... కొంతమంది పెద్దలు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని పేర్కొన్నారు. విూడియా సంస్థలు కొన్ని దద్ధమ్మలుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. విూకు లాగా తాము దిగజారి మాట్లాడలేదని, తాము మాట్లాడితే విూరు కాదు విూ బాబు, విూ తాతలు కూడా తట్టుకోలేరన్నారు.
విూరు మాట్లాడితేనే సూక్తులా