దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు
టిఆర్‌ఎస్ పథకాల స్ఫూర్తితో కేంద్ర పథకాలుటిఎస్ ఐపాస్ విధానం కూడా కేంద్రం తీసుకు రాబోతున్నది
హైటెక్స్‌లో పార్టీ సమావేశ ఏర్పాట్లను పరిశీలించిన కెటిఆర్
హైదరాబాద్,అక్టోబర్14 (జనం సాక్షి) : తెలంగాణ ప్రభుత్వ పరిపాలన గొప్పగా సాగుతుందని, అపూర్వమైన విధానాలతో, పాలసీలతో దేశంతో పాటు ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా నిలిచామని మంత్రి కెటిఆర్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పథకాలను, కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. రైతుబంధు, మిషన్ భగీరథ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని పీఎం కిసాన్, జల్ జీవన్ మిషన్‌ను కేంద్రం ప్రారంభించిందని తెలిపారు. ఈ నెల 25న హైటెక్స్‌లో జరగనున్న టీఆర్‌ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. అనంతరం మంత్రి కేటీఆర్ విూడియాతో మాట్లాడుతూ అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నాము అని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. తమ పార్టీ విధానాలను, పరిపాలనను మెచ్చి ప్రజలు మరోసారి ఆశీర్వదించారు అని పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్ వంటి అనుమతుల విధానాన్ని కూడా కేంద్రం త్వరలో తీసుకురాబోతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకప్పుడు బెంగాల్ చేసే పనిని రేపు భారత్ చేస్తుంది అనే నినాదం ఉండేది? కానీ ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తుందో.. రేపు భారత్ అదే చేస్తుంది అన్నట్లుగా మారిందన్నారు. 25న జరిగే పార్టీ జనరల్ బాడీ విూటింగ్‌లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. ఈ కార్య క్రమానికి వచ్చే పార్టీ ప్రతినిధులతో పాటు.. మొత్తం సమావేశం సజావుగా సాగేలా అనేక ఏర్పాట్లను చేస్తు న్నామని కేటీఆర్ తెలిపారు. సభ నిర్వహణ, దానికి సంబంధించిన ఏర్పాట్లను, కార్యక్రమాలను సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరపున పలు కమిటీలను కేటీఆర్ ప్రకటించారు. ఆహ్వాన కమిటీ,సభావేదిక ప్రాంగణం,
నగర అలంకరణ, ప్రతినిధుల నమోదు వాలంటీర్ల కమిటీ, పార్కింగ్, భోజన కమిటీ, తీర్మానాల కమిటీ, విూడియా కమిటీలతో పాటు ఇతర కమిటీలను కేటీఆర్ వెల్లడిరచారు. ఈ సమావేశానికి వచ్చే ప్రతినిధులకు పార్టీ తరఫున గుర్తింపు కార్డులను అందిస్తామన్నారు. పార్టీ ఆహ్వానించిన వారు మాత్రమే ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.