ధనలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
భద్రాచలం,అక్టోబర్9 (జనంసాక్షి): భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగోరోజైన శనివారం అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం మహా నివేదన రాజభోగం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సామూహిక లక్ష కుంకుమార్చనలు చేయనున్నారు. రాత్రి 8 గంటలకు సీతారాముల నిత్యకల్యాణమూర్తులను తిరువీధులలో ఊరేగిస్తారు. రేపు ధాన్యలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు.
భాద్రాద్రిలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు