రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంతో కలబడతాం

 



` పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి రానివ్వం
` ప్రభుత్వ రంగంలో వైద్యసేవలను బలోపేతం చేస్తాం
` త్వరలోనే పల్లె దవాఖానాలు ప్రారంభిస్తాం
` వక్ఫ్‌ బోర్డు భూములపై సీబీసీఐడీ
` దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రగతి
` గ్రామాలు, పట్టణాల ప్రగతికి పెద్దపీట వేశాం
` 90శాతం మొక్కలు బతికేలా చర్యలు
` ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారానే నిధులు
` హైదరాబాద్‌ను ఇస్తాంబుల్‌లా తీర్చిదిద్దుతాం
` అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌,అక్టోబరు 7(జనంసాక్షి):జాతీయ సగటుకు ఆదాయాన్ని సమకూర్చే నాలుగు ఉత్తమ రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ఆర్బీఐ కితాబిచ్చింది. ఇది తెలంగాణ సాధిస్తున్న ప్రగతి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి రానివ్వమని ఆయన స్పష్టం చేశారు.. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీలో చేరుస్తామంటే భాజపా పాలిత రాష్ట్రాలు వ్యతిరేకించాయి. పెట్రోల్‌, డీజిల్‌పై వచ్చే ఆదాయం కూడా రాకుండా చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.తెలంగాణ ధనిక రాష్ట్రం అని చాలాసార్లు చెప్పాం. అందుకే ఇవాళ ఇండియాలో నంబర్‌ వన్‌ శాలరీ మన ఉద్యోగులకు ఇస్తున్నాం. మన దగ్గర నుంచి కేంద్రానికి పోయే నిధులు ఎక్కువ. అక్కడ్నుంచి చాలా తక్కువ నిధులు వస్తాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రావాల్సిందే అని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చేది కేవలం సీఎస్‌ఎస్‌ మాత్రమే అని తెలిపారు. శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తోంది. రాష్ట్రాల హక్కులపై కేంద్రంతో పోరాడుతాం. ఇటీవలే తమిళనాడు సీఎం స్టాలిన్‌ కూడా లేఖ రాశారు. ఒక ప్రాంతీయ పార్టీ నేతగా కేంద్రం తీరును వ్యతిరేకిస్తున్నాను. గ్రామపంచాయతీల అభివృద్ధికి అక్టోబర్‌ వరకు ప్రతి నెల రూ. 227 కోట్లు విడుదల చేశాం. గ్రామపంచాయతీలకే కాకుండా అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ కు రూ. 112 కోట్లు విడుదల చేస్తున్నాం. దీంట్లో స్టేట్‌ గవర్నమెంట్‌ బడ్జెట్‌ ఉంటది. ఫైనాన్స్‌ కమిషన్‌ కేటాయింపులు కూడా ఉంటాయి.గ్రావిూణ ప్రాంతాల అభివృద్ధి కోసం పదేండ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ. 12,173 కోట్లు మాత్రమే. కానీ ఈ ఏడేండ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. 58,303 కోట్లు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో మంచి వికాసం జరుగుతుంది. ప్రగతి కనబడుతోంది. ఇప్పుడిప్పుడే మంచి అభివృద్ధిలో పయనిస్తున్నాం. అన్ని శాఖలు అద్భుతంగా పని చేస్తున్నాయి. చక్కటి ఫలితాలు వస్తున్నాయి. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలను పక్కాగా అమలు చేస్తున్నాం అని సీఎం తెలిపారు.
త్వరలోనే పల్లె దవాఖానలు ప్రారంభం : సీఎం కేసీఆర్‌
రాష్ట్రంలో త్వరలోనే పల్లె దవాఖానలు ప్రారంభం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభ వేదికగా ప్రకటించారు. శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. హైదరాబాద్‌ నగరంలో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని టార్గెట్‌ ఇచ్చాను. డివిజన్‌కు రెండు చొప్పున ఏర్పాటు చేయాలని చెప్పాను. కొన్ని బస్తీల్లో మూడు పెట్టాలని చెప్పాను. మొత్తానికి నగరంలో బస్తీ దవాఖానలు నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఆరోగ్య సదుపాయాలు పెంచాలనే ఉద్దేశంతో పల్లెల్లో దవాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కరోనా, స్వైన్‌ ఫ్లూ లాంటి వైరస్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పల్లె దవాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. త్వరలోనే ఈ దవాఖానలు వస్తాయి. అన్ని ఏర్పాట్లు జరిగాయి. కొద్ది రోజుల్లోనే ప్రారంభం అవుతాయి. సంబంధిత శాఖ చర్యలు తీసుకుంటుంది. ఆస్పత్రుల ఆధునీకరణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం అని కేసీఆర్‌ తెలిపారు.12,769 గ్రామాలకు పంచాయతీ సెక్రటరీలను నియమించాం. టాప్‌ టు బాటమ్‌ అన్ని పోస్టులకు ప్రమోషన్లు ఇచ్చాం. కొత్తగా అవసరమైన చోట నియామకాలు జరిపాం. మహిళలకు ప్రసూతి సెలవులు ఇచ్చినప్పుడు.. వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. అలా 980 మంది పని చేస్తున్నారు. ఎక్కడా ఖాళీ ఏర్పడ్డ వారం రోజుల్లోనే నియమిస్తున్నారు. ఇదంతా అభివృద్ధి కోసమే అన్ని అన్నారు. నిధులు విడుదల కూడా అలాగే చేస్తున్నాం అని పేర్కొన్నారు.విూరు చెట్లు పెట్టలేదు. అభివృద్ధి చేయలేదు. మేం రెండిరటిని చేస్తున్నామని స్పష్టం చేశారు. మంచినీళ్ల కోసం గోస ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలో బిందెల ప్రదర్శన లేదు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గ్రామపంచాతీయలను, ఇతర ఆస్తులను కుదవపెట్టాలని కేంద్రం చెబుతుంది. మంచినీళ్ల కోసం మిషన్‌ భగీరథను చూసి నీతిఆయోగ్‌ ప్రశంసించింది. రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నీతి ఆయోగ్‌ సూచిస్తే 24 పైసలు కూడా ఇవ్వలేదు. అవార్డులు మాత్రం మోయలేనన్ని వచ్చాయి. మిషన్‌ భగీరథ పుణ్యమా అని ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణ విజయం సాధించింది. ఈ విషయాన్నే కేంద్రం అధికారికంగా ప్రకటించింది అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రగతి
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం కేసీఆర్‌ ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిందని, అప్పుడు గ్రామాలు దారుణంగా ఉండేవి. ఒక పద్ధతిగా గ్రామాలు అభివృద్ధి చెందలేదు. అరాచకంగా, మురికి కూపాలుగా ఉండేవి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీల్లో విశేషమైన అభివృద్ధి జరిగింది. బోలెడన్ని అవార్డులు తెలంగాణ గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు వచ్చాయన్నారు. గతంలో పారిశుధ్య కార్మికులకు సరిగా జీతాలు ఇచ్చేవారు కాదు. గ్రామపంచాయతీలకు చార్జ్‌డ్‌ అకౌంట్‌ ఏర్పాటు చేశాం. జీతాలకు ఇబ్బంది లేకుండా వర్కర్లకు ముందుగా జీతాలు ఇచ్చేందుకు ఇది ఏర్పాటు చేశాం. గ్రామపంచాయతీలు మున్సిపాలిటీల్లో కలుస్తుంటే ప్రజలు సంతోషించాలి. కానీ ప్రజలు కోర్టుకు వెళ్తారు. ఎక్కడ కొత్తగా మున్సిపాలిటీలో చేరిన ఆ గ్రామాల అభివృద్ధికి కొన్ని నిధులు కేటాయించామన్నారు. పట్టణ ప్రగతికి రూ.2,736 కోట్లు విడుదల చేశామని సీఎం కేసీఆర్‌, అసెంబ్లీలో తెలిపారు. హైదరాబాద్‌లో రూ.67,500 కోట్లతో అభివృద్ధి చేశామని ప్రకటించారు. ఇండ్లు కట్టడం లేదని బీజేపీ విమర్శిస్తోందని, అయితే మరోవైపు తెలంగాణ ప్రగతిని మెచ్చి ప్రధాని అవార్డులు ఇస్తున్నారని గుర్తుచేశారు. పట్టణంలో చేసేది ఏం లేదని అబద్దాలు చెప్పను.. ఇంకా చేయాల్సింది ఉందన్నారు. ప్రజలు అర్థం చేసుకొని దీవించాలని కోరారు. వక్ఫ్‌బోర్డు భూముల సర్వేకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. దేవాదాయ, వక్ఫ్‌ బోర్డు భూముల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉంటుందని, అవసరమైతే సీబీ సీఐడీకి అప్పగిస్తామని కేసీఆర్‌ తెలిపారు.వక్ఫ్‌ బోర్డు భూముల విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. వక్ఫ్‌ బోర్డు భూముల విూద విచారణ జరిపించాలి అంటున్నారు. తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వంలో రికార్డుల ఆధారంగా దేవాదాయ, వక్ఫ్‌ బోర్డులు ఫ్రీజ్‌ అయ్యాయి. గవర్నమెంట్‌ పరంగా వాటిని ఎట్టి పరిస్థితుల్లో రిజిస్టేష్రన్లు చేయడం జరగదన్నారు. కొన్ని సందర్భాల్లో కోర్టుల్లో మన వారు సరిగా వాదించడం లేదని అక్బరుద్దీన్‌ ఓవైసీ అంటున్నారు. వక్ఫ్‌ బోర్డుల విషయంలో జరిగిన దారుణాలపై సీబీసీఐడీ విచారణకు వెంటనే ఆదేశిస్తాను అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అద్భుతంగా చెప్పారు.. వాళ్లు అడగాల్సిందే.. మేం చేయాల్సిందే. మంచిని అభినందిస్తుంటే ఎందరికో ఉత్సాహం వస్తది. 85 శాతం మొక్కలు బతికి ఉండాలని చెప్పా. 90 శాతం మొక్కలు సజీవంగా ఉన్నాయి. ఎక్కడైనా తక్కువ ఉంటే చెప్పండి. కఠిన చర్యలు తీసుకుంటాం. మా కంటే గొప్పగా కాంగ్రెస్‌ ఏం చేయలేదు. గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలో చేరితే స్వాగతించాలని కేసీఆర్‌ పేర్కొన్నారు. 2018 చట్టం తర్వాత 85 శాతం మొక్కలు బతికి ఉండకపోతే కమిషనర్‌, పంచాయతీ సెక్రటరీ, కౌన్సిలర్‌, సర్పంచ్‌ ఉద్యోగం పోతది అని చట్టంలో చెప్పాం. దీనిపై పంచాయతీరాజ్‌ ట్రిబ్యునల్‌ పెట్టాం. లక్ష్యం సాధించేందుకు ఈ నిబంధన పెట్టాం. ఇండియాలోనే ప్రథమంగా కలెక్టర్‌ లోకల్‌ బాడీస్‌ అని పోస్టు పెట్టి, వాహనాలు కొనిచ్చాం. వీరు గ్రావిూణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధిని పర్యవేక్షిస్తారు. మాకున్న నివేదికల ప్రకారం 90 శాతం మొక్కలు పైబడి బతికి ఉన్నామని తెలిపారు. మొక్కలు బతకని గ్రామాలుంటే తమ దృష్టికి తీసుకువస్తే.. నిమిషాల వ్యవధిలోనే చర్యలు తీసుకుంటాం అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇకపోతే రాష్ట్రంలో సర్పంచ్‌ల కంటే సఫాయి కార్మికులకే ఎక్కువ జీతం ఇస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో పర్‌ క్యాపిట రూ. 4 ఇస్తే, తెలంగాణ మాత్రం రూ. 669 ఇస్తోంది. ఈ విషయం సర్పంచ్‌లు, ప్రజలు వింటున్నారు. జీహెచ్‌ఎంసీలో కార్మికులకు రూ. 8500 ఇస్తే.. ఈరోజు కార్మికుల జీతాలు రూ. 17 వేలు. సర్పంచ్‌ల కంటే ఎంపీటీసీల కంటే ఎక్కువ జీతం ఇస్తున్నాము. సఫాయి అన్న నీకు సలాం అని చెప్పిన. కార్మికులను మనం గౌరవించాలి. గ్రామాలు, పట్టణాలను శుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు దండం పెట్టాలి. గ్రామపంచాయతీ సిబ్బందికి రూ. 8500ల చొప్పున ఇస్తున్నాం. మున్సిపాలిటీల్లో రూ. 12 వేలకు తగ్గకుండా జీతాలు ఇస్తున్నాం. సర్పంచ్‌ల గౌరవ వేతనాలు ఒకప్పుడు చాలా తక్కువ. జిల్లా ప్రజాపరిషత్‌ చైర్మన్లకు గతంలో రూ. 7500 ఉండే. ఇప్పుడు లక్ష రూపాయాలు టీఆర్‌ఎస్‌ ఇస్తుంది. జడ్పీటీసీలకు గతంలో రూ. 2250 ఇస్తే.. ఇప్పుడు రూ. 13 వేలు ఇస్తున్నాం. మండల ప్రజాపరితష్‌ సభ్యులకు గతంలో రూ. 1500 ఇస్తే.. ఇప్పుడు రూ. 13 వేలు ఇస్తున్నాం. సర్పంచ్‌లు, ఎంపీటీలకు రూ. 6500లకు పెంచాం. లోకల్‌ బాడీస్‌ కు ఇచ్చే నిధుల్లో కేంద్రం 25 శాతం కోత విధించింది అని సీఎం తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో మంచినీళ్లు లేవు, కరెంట్‌ లేదు. వంగిపోయిన కరెంట్‌ స్తంభాలు ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. కాంగ్రెస్‌ హయాంలో గ్రామాల్లో ఘోరమైన పరిస్థితి ఉండే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలక్టిస్రిటీ బోర్డుతో సుదీర్ఘంగా చర్చించి, పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా గ్రావిూణ ప్రాంతాల్లో 2,33,000 కొత్త విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేశాం. 59 వేల కి.విూ. మేర విద్యుత్‌ వైర్లు ఏర్పాటు చేశాం. ఇంకా ఎక్కడైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తాం అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.
ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారానే నిధులు
ఫైనాన్స్‌ కమిషన్‌ రెకమెండేషన్స్‌ ప్రకారమే నిధులు విడుదల అవుతాయని, అందులో కొత్తగా ఇచ్చేదేవిూ ఉండదని సిఎం కెసిఆర్‌ అన్నారు. నిధులు పక్కదారి పట్టించడం అంతకన్నా ఉండదన్నారు. అసెంబ్లీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. శాసనసభలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉపాధి హావిూ నిధులను దారి మళ్లిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ కలగజేసుకున్నారు. భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. అది వారి అవగాహన లోపమైనా ఉండాలి. పంచాయతీరాజ్‌ అని మనం పిలుస్తాం. కేంద్రంలో రూరల్‌ డెవపల్‌మెంట్‌ అని పిలుస్తాం. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉండవు. మొన్ననే క్లియర్‌గా చెప్పినా. ఈ దేశంలో కొన్ని సిస్టమ్స్‌ ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు ఉంటాయి. ఫైనాన్స్‌ కమిషన్‌ ఉంటుంది. ఈ ఫైనాన్స్‌ కమిషన్‌ అన్ని రాష్టాల్రను సంప్రందించి, స్థానిక స్వపరిపాలన సంస్థలు కూడా పని చేయాలని ప్రతి రాష్టాన్రికి, ప్రతి సంవత్సరానికి ఇంత ఇవ్వాలని ఐదేండ్లకు ఒకసారి రెకమెండ్‌ చేస్తారు. అవి ్గªనాన్స్‌ కమిషన్‌ కేటాయింపులు.. కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు కావు అని స్పష్టం చేశారు. కొన్ని ట్యాక్స్‌లు కేంద్రం, రాష్ట్రం వసూలు చేస్తోంది.కేంద్రం వసూలు చేసే పన్నుల్లో నుంచి క్రమానుగతంగా, ఫైనాన్స్‌ కమిషన్‌ రిపోర్ట్‌ ఆధారంగా కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలి. కేంద్రం పోస్టు మ్యాన్‌లా మాత్రమే పని చేస్తోంది. కేంద్రం నిధులు అనేవి ఉండవు. కేంద్రం నిధులు ఇస్తుందనడం సరికాదు. ప్రభుత్వ, సమాజ నిర్వహణలో పంచుకోబడ్డ బాద్యతల్లో కొన్ని పనులు కేంద్రం, కొన్ని పనులు రాష్ట్రం చేస్తుంది. భట్టి విక్రమార్క ప్రశ్నకు తమ వద్ద అద్భుతమైన సమాధానం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు.
హైదరాబాద్‌ నగరాన్ని ఇస్తాంబుల్‌లా తీర్చిదిద్దుతాం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరాన్ని ఇస్తాంబుల్‌ లాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోమారు స్పష్టం చేశారు. ఈ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుంటేనే రాష్ట్రం ప్రతిష్ఠ పెరుగుతుందన్నారు. హైదరాబాద్‌ పాత నగరాన్ని ఇస్తాంబుల్‌ చేస్తామనడంలో తప్పు లేదు. ఇస్తాంబుల్‌గా కావాలని కోరుకోవద్దా? ఇది కూడా అనుకోవద్దా? కలలు కనొద్దా? బారాబార్‌ చేసి చూపిస్తాం. వక్రీకరణలు చేయడం దుర్మార్గం. కరీంనగర్‌ను డల్లాస్‌ చేస్తామని చెప్పలేదు. రోప్‌ వే బ్రిడ్జి కావాలని మంత్రి గంగుల కమలాకర్‌ అడిగారు. కరీంనగర్‌ పక్కనే నది, కాలువలు అందంగా ఉంటాయి. వాటిని సుందరంగా తీర్చిదిద్దుకుంటే కరీంనగర్‌ డల్లాస్‌గా కనిపిస్తుందని చెప్పాను. అది తప్పా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ఈ అంశాలను ప్రస్తావించారు. ఈ నగరంలో డ్రైనేజీ వ్యవస్థను కాంగ్రెస్‌ నాశనం చేసింది. విూరు చేసిన తప్పులను సవరించలేక చచ్చిపోతున్నాం. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను రూపుదిద్దేందుకు రూ. 15 వేల కోట్లు కావాలని అధికారులు చెప్పారు. ఒక రోజులో అయ్యే పని కాదు.. దశలవారీగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని మున్సిపల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. హైదరాబాద్‌నే నేనే కట్టాను అని ఒకాయన చెబుతుండే. 400 ఏండ్ల చరిత్ర ఉన్న నగరం హైదరాబాద్‌. హైదరాబాద్‌ అనేది ఇంటర్నేషనల్‌ సిటీ. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల ఉన్నాయి. అనేక కాన్ఫరెన్స్‌లు జరుగుతుంటాయి. మెగా మెట్రో సిటీలు.. ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌. హైదరాబాద్‌ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రానికి నివేదిక ఇచ్చాం. ఈ నగరాలను బాగు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం ప్రతి ఏడాది రూ. 30 లక్షల కోట్ల బ్జడెట్‌ పెడుతారు. ఈ ఐదు నగరాలను గొప్పగా చేయడానికి రూ. 50 వేల కోట్లు ఇవ్వాలని కోరాను. ఏడాదికి కేంద్రం రూ. 10 వేల కోట్లు, రాష్టాల్రు రూ. 10 వేల కోట్లు కలిపి మొత్తంగా రూ. 20 వేలు కోట్లు ఖర్చు చేస్తే అవి ఒక పద్ధతికి వస్తాయని చెప్పాను. కానీ కేంద్రం నుంచి శూన్యం. స్పందన కూడా రాదు అని కేసీఆర్‌ మండిపడ్డారు. ఇకపోతే జాతీయ సగటుకు ఆదాయాన్ని సమకూర్చే నాలుగు ఉత్తమ రాష్టాల్లో తెలంగాణ ఒకటి అని ఆర్బీఐ కితాబిచ్చింది. ఇది తెలంగాణ సాధిస్తున్న ప్రగతి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చాలాసార్లు చెప్పాం. అందుకే ఇవాళ ఇండియాలో నంబర్‌ వన్‌ శాలరీ మన ఉద్యోగులకు ఇస్తున్నాం. మన దగ్గర నుంచి కేంద్రానికి పోయే నిధులు ఎక్కువ. అక్కడ్నుంచి చాలా తక్కువ నిధులు వస్తాయి. కేంద్ర పన్నుల్లో రాష్టాల్ర వాటా రావాల్సిందే అని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చేది కేవలం సీఎస్‌ఎస్‌ మాత్రమే అని తెలిపారు. కేంద్రం రాష్టాల్ర హక్కులను హరిస్తోంది. ఇటీవలే తమిళనాడు సీఎం స్టాలిన్‌ కూడా లేఖ రాశారు. ఒక ప్రాంతీయ పార్టీ నేతగా కేంద్రం తీరును వ్యతిరేకిస్తున్నాను. గ్రామపంచాయతీల అభివృద్ధికి అక్టోబర్‌ వరకు ప్రతి నెల రూ. 227 కోట్లు విడుదల చేశాం. గ్రామపంచాయతీలకే కాకుండా అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ కు రూ. 112 కోట్లు విడుదల చేస్తున్నాం. గ్రావిూణ ప్రాంతాల అభివృద్ధి కోసం పదేండ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ. 12,173 కోట్లు మాత్రమే. కానీ ఈ ఏడేండ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. 58,303 కోట్లు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో మంచి వికాసం జరుగుతుంది. ప్రగతి కనబడుతోంది. ఇప్పుడిప్పుడే మంచి అభివృద్ధిలో పయనిస్తున్నాం. అన్ని శాఖలు అద్భుతంగా పని చేస్తున్నాయి. చక్కటి ఫలితాలు వస్తున్నాయి. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలను పక్కాగా అమలు చేస్తున్నాం అని సీఎం తెలిపారు.