భారీ అగ్నిప్రమాదం.. రూ.10 లక్షల ఆస్తి నష్టం


హైదరాబాద్‌, డిసెంబర్‌3 (జనం సాక్షి)      : నగరంలోని ఓల్డ్‌ సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఓల్డ్‌సిటీలోని లాలిత్‌ బాఫ్‌ులో ఉన్న ఓ పాత సామాను గోదామ్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్‌ మొత్తానికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంతో సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు గోదాం యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.