టిఆర్‌ఎస్‌కు తిరుగులేదన్న ఇంద్రకరణ్
నిర్మల్,డిసెంబర్14(జనంసాక్షి ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి తిరుగులేని ఆదరణ ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇక్కడ జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్తి దండే విఠల్ 740 ఓట్లతో ఘనవిజయం సాధించిన సందర్భంగా మంత్రి స్పందించారు.ఇక్కడ విఠల్ సవిూప ప్రత్యర్థి కేవలం 74 ఓట్లకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో మాట్లాడిన మంత్రి ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌దే విజయం అని చెప్పారు. ఈ విజయం కోసం కృషి చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అందరి సమిష్టి కృషితోనే ఎమ్మెల్సీగా దండే విఠల్ గెలుపొందినట్లు ఆయన పేర్కొన్నారు.