స్వాగతించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్,డిసెంబర్16 (జనం సాక్షి): వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటుకు జెన్ ప్యాక్ట్ ముందుకొచ్చింది. జెన్‌ప్యాక్ట్ ప్రకటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. జెన్‌ప్యాక్ట్ రాకతో వరంగల్ ఐటీ మరింత బలోపేతం అవుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. టైర్ 2 పట్టణాల్లో ఐటీ అభివృద్ధికి సహకరిస్తున్న సంస్థలకు మద్దతు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జెన్‌ప్యాక్ట్ సీఈవో త్యాగరాజన్, వారి బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. టెక్ మహీంద్రా, సయింట్ ఇప్పటికే వరంగల్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. తాజాగా జెన్‌ప్యాక్ట్ రాకతో వరంగల్ అత్యున్నత స్థాయికి ఎదగనుందని కేటీఆర్ పేర్కొన్నారు.