.ప్రజాప్రతినిధుల జీతాలు పెంపు కోడ్‌ ఉల్లంఘనే


` కేంద్ర ఎన్నికల సంఘం
దిల్లీ,డిసెంబరు 7(జనంసాక్షి): స్థానిక ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుతూ పురపాలకశాఖ జీవో జారీ చేయడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ.. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, పురపాలకశాఖ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డికి హెచ్చరిక జారీ చేయాలని సీఎస్‌ను ఆదేశించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత ప్రజా ప్రతినిధుల జీతాల పెంపుపై పురపాలకశాఖ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 10 తెలంగాణలో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.