ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్‌

  


భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు

ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ 

హైదరాబాద్‌,డిసెంబర్‌9(జనంసాక్షి ): తెలంగానలోని ఐదు నియోజకవర్గాల్లోని 6 స్థానాలకు స్థానిక కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు శుక్రవారం జరుగన్నాయి. ఈ మేరకు ఎన్‌ఇనకల సంఘం భారీగా ఏర్పాట్లు చేసింది. ఎన్నికలను పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు సీఈవో శశాంక్‌ గోయల్‌ ప్రకటించారు.  శుక్రవారం ఎన్నికలు జరుగనున్న జిల్లాల్లో ఏర్పాట్లన్నీ పూర్తిచేసారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా జిల్లాల  కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌ క్యాస్టింగ్‌ ఏర్పాటు చేసి పరిశీలించనున్నారు. బుధవారం నుంచే ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న జిల్లాల్లో బార్లు, పబ్బులు, వైన్‌ షాపులు మూతపడ్డాయి.  ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో 5,326 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 2,329 మంది , స్త్రీలు 2,997 ఉన్నట్టు తెలిపారు. పోలింగ్‌ జరిగే జిల్లాల్లో భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల నిర్వహణకు సీఈవో అదేశాలు జారీచేశారు. స్థానిక సంస్థ, శాసనమండలి సభ్యుల ఎన్నికలపోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని  శశాంక్‌గోయల్‌ అన్నారు.  పోలింగ్‌ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని అన్నారు. ఈనెల 10న ఉదయం 8గంటలనుంచి సాయంత్రం 4గంటలవరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. అన్నిపోలింగ్‌ కేంద్రాలలో కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని, సామాజికదూరం పాటించాలని, శానిటైజర్లు, మాస్కులు వినియోగించేలా చర్యలు తీసుకోవడంతోపాటు ఆరోగ్య కార్యకర్తలను నియ మించాలన్నారు. గట్టిపోలీసు బందో బస్తు ఏర్పాటుచేయాలన్నారు. పోలింగ్‌ సామాగ్రితో డిస్టిబ్యూష్రన్‌ కేంద్రం నుంచి పోలింగ్‌కేంద్రాలకు వెళ్లేటప్పుడు, పోలింగ్‌ ముగిసిన తరువాత బ్యాలెట్‌ బాక్సులతో రిసెప్షన్‌ సెంటర్‌కు వచ్చేటప్పుడు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించా ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు.  ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచారు. ఈనెల 14న జరిగే కౌంటింగ్‌ పక్రియను సైతం పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లతో అధఙకారులు సిద్ధంగా ఉన్నారు. పోలీసుశాఖ అధికారుల సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటు వేయడానికి వచ్చే ఓటర్లు ఎన్నికల కమిషన్‌ అనుమతించిన గుర్తింపు కార్డులను వెంట తీసుకురావాలన్నారు. ఓటరు గుర్తింపు కార్డులు లేదా ఎన్నికల కమిషన్‌ సూచించిన 11 గుర్తింపులలో ఏదైనా ఒకటి పరిశీలించాకే ఓటు వేసేందుకు ఓటర్లను కేంద్రంలోకి అనుమతించనున్నారు. పోలింగ్‌ అధికారులు సమకూర్చే వైలెట్‌ పెన్నుతోనే బ్యాలెట్‌ పేపర్‌పై ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేసేలా ఓటర్లకు తెలియ జేస్తారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేయాలని, ఏఎ న్‌ఎంలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈనెల 14న జరిగే ఓట్ల లెక్కిం పు పక్రియను కూడా పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.