విద్యుత్ ఉత్పత్తికి నిరంతరాయంగా శ్రమ
భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్7 (జనంసాక్షి) : తెలంగాణలో నిరంతర విద్యుత్‌కు ఎలాంటి ఢోకా లేదని, సరపోయేలా విద్యుత్ అందుతోందని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు అన్నారు. ప్రభుత్వ సంకల్పం మేరకు తగిన మేరకు ఉత్పత్తిపై దృష్టి సారించామని అన్నారు. నిరంతరాయంగా అందుతున్న విద్యుత్ కోసం సంస్థ అవిశ్రాంతంగా పనిచేస్తోందని అన్నారు. పాల్వంచ పట్టణంలో గల కేటీపీఎస్ కర్మాగారాలను మంగళవారం దేవులపల్లి ప్రభాకర్ రావు సందర్శించారు. కేటీపీఎస్ 5,6, దశలలోని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగాఆర్టిజన్ కార్మికుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అంతముందు ఆయన కర్మాగారం 56 కర్మాగారం గేటు వద్ద గల కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ తెలంగాణ జెన్‌క్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న శిక్షణతో పాటు కేంద్రానికి సంబంధించిన నూతన భవనాలను ప్రభాకార్‌రావు పరిశీలించారు .అనంతరం మణుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ ను సందర్శించేందుకు వెళ్లిపోయారు.