కేంద్రం బెదిరింపులకు లొంగేది లేదు
బిజెపికి మత రాజకీయాలు తప్ప మరేవిూ తెలియదు
ఏం చేశారని ఉద్యమకారులు బిజెపిలో చేరాలి
కాంగ్రెస్, బిజెపిలపై మండిపడ్డ మంత్రి కెటిఆర్
చల్మెడకు కండువా కప్పి టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానం
హైదరాబాద్,డిసెంబర్8 జనం సాక్షి : తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులపై టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకరు ఢల్లీికి గులాం అయితే.. మరొకరు గుజరాత్‌కు గులాం అని కేటీఆర్ విమర్శించారు. మేం ఢల్లీి, గుజరాత్‌లకు గులాములం కాదు.. విూ ఉడుత ఊపులకు భయపడేది లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు. విూరేం పీకారని ఉద్యమకారులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోకి రావాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఏమైనా అంటే సీబీఐ, ఈడీ అని భయపెట్టిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇలాంటి బెదిరింపులకు లొంగేది లేదన్నారు. మోదీకి, సోనియా గాంధీకి భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కరీంనగర్ జిల్లాకు చెందిన చల్మెడ లక్ష్మీనరసింహారావు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో లక్ష్మీనరసింహారావుకు కేటీఆర్ గులాబీ జెండా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీతో రెండున్నర దశాబ్దాల అనుబంధాన్ని వదులుకొని లక్ష్మీనరసింహారావు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. లక్ష్మీనరసింహారావు దాదాపుగా ఒక దశాబ్దన్నర కాలం నుంచి తెలుసు. ముక్కుసూటి వ్యక్తిత్వం గల మనిషి. 2006లో కరీంనగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ గెలువబోతున్నారని ఆయన తనతో చెప్పారు. లక్ష్మీనరసింహారావు చేరికతో పూర్వ కరీంనగర్ జిల్లాలో పార్టీకి కొత్త శక్తి వస్తుందని కేటీఆర్ తెలిపారు. యాసంగిలో పండిరచే వరి ధాన్యం సేకరణపై తేల్చండి అని టీఆర్‌ఎస్ ఎంపీలు వారం రోజులు అడిగితే స్పందన లేదు. ఒక బీజేపీ ఎంపీ మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ బియ్యం స్మగ్లర్లు అని అంటుండు. వాడు మనిషా.. పశువా.. వాన్ని ఏమనాలో అర్థం కాదు. బియ్యం స్మగ్లర్లా.. ఏమైనా తెలివుందా? ఏమైనా మెదడు మోకాళ్లలకు జారిందా? అని అడిగారు. లేక ఏమన్నా నెత్తి మొత్తం కరాబ్ అయిందా? అని అడిగారు. దున్నపోతువిూద వాన పడ్డట్టు వ్యవహరిస్తుండ్రు. బండి సంజయ్ తొండి సంజయ్ లా మారారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన పీసీసీ చీఫ్ కాదు.. చిల్లరగాడు అని ధ్వజమెత్తారు. రూ. 50 కోట్లు లంచమిచ్చి పీసీసీ తెచుకున్నాడని కోమటి రెడ్డే ఆరోపించాడు. సచివాలయంలో నేల మాళిగలు ఉన్నాయని పిచ్చోడిలా మాట్లాడిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు అయ్యాడు అని కోపోద్రిక్తులయ్యారు. ఒకడు బియ్యంలో రూ. 3 వేల కోట్ల స్కాం అంటాడు. మరొకడు వ్యాక్సిన్లలో రూ. 10 వేల కోట్ల స్కాం అంటాడు. ఏదీ పడితే మాట్లాడే వాడికి నెత్తి లేదు కత్తి లేదంటూ దుª`యబట్టారు. బీజేపీ తెలంగాణకు ఏం పీకిందని ఉద్యమ కారులు ఆ పార్టీ లో చేరతారు అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ ఉడత ఊపులకు భయపడే వారు ఎవ్వరూ లేరు. అరెస్టులు చేస్తామని బెదిరిస్తే భయపడే వారు ఎవ్వరూ లేరు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. మేం ఎవ్వరికీ బానిసలం కాదు. తెలంగాణకే బానిసలం. సోనియా గాంధీ, మోదీకి భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు. దేశ జిడిపిలో తెలంగాణ వాటా ఐదు శాతమని కేంద్రమే ప్రకటించిందని మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. తెలంగాణ వస్తే పరిపాలన చేసుకుంటారా? అని హేళన చేశారన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు మన తలసరి ఆదాయం 1.12 లక్షల అని, ఇప్పుడు మన తలసరి ఆదాయం రూ.2.37 లక్షలకు పెరిగిందన్నారు. సమర్థుడైన నాయకుడు సిఎం కెసిఆర్ రూపంలో ఉన్నాడని పొగిడారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశానికి అధిక ఆదాయమిస్తున్న రాష్టాల్ల్రో తెలంగాణది 4వ స్థానమని తెలిపారు. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర ఆదాయం లక్ష రూపాయలు ఎక్కువన్నారు. అలాగే వరి కొనుగోళ్లపై కేంద్రానికి ఒక జాతీయ విధానం ఉండాలన్నారు. బియ్యం స్మగ్లర్లు అంటున్న బీజేపీ ఎంపీ మనిషా, పశువా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలవి చిల్లర రాజకీయాలని ఆయన మండిపడ్డారు. ఒకరు ఢల్లీికి గులాం, మరొకరు గుజరాత్‌కి గులాం అని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది టీఆర్‌ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. బీజేపీ ఏం చేసిందని ఉద్యమకారులంతా విూ పార్టీలోకి రావాలి? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలవి దివాన్ మాటలని విమర్శించారు. కార్యక్రమంలో కెకెతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.