ఆనాడు హావిూ ఇచ్చినా పట్టించుకోని నేతలు
మెదక్,డిసెంబర్11 (జనంసాక్షి) :
మెదక్ జిల్లాలో జన్మించిన మల్లినాథసూరి గ్రంథధాలు పదిలపర్చగంతో పాటు ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని ఆనాటి ఉప సభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి తెలుగు మహాసభల సందర్బంగా ఇచ్చిన హావిూ అలాగే ఉండిపోయింది. ఇప్పుడా విషయం కూడా అంతా మర్చి పోయారు. తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చిన కవి మల్లినాథసూరిని తెలుగు మహాసభల సందర్భంగా స్మరించుకున్నారు. సిఎం కెసిఆర్ అయితే ఆదికవి మల్లినాధ సూరియే అని విశ్లేషించారు. మెదక్ జిల్లాలోని కొల్చారం గ్రామంలో మహాకవి, వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచల మల్లినాథ సూరి వారసులు నివసించిన ఇల్లు నేటికీ ఉంది. ఆనాడు మహాసభల సందర్బంగా అక్కడ ఏర్పాటుచేసిన మల్లినాథుడి విగ్రహానికి పద్మాదేవేందర్ పూలు సమర్పించి నివాళులు అర్పించారు. మల్లినాథ సూరి ప్రతిమను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హావిూ ఇచ్చినా దాని గురించి ఆమె కూడా మర్చిపోయారు. జిల్లా కేంద్రంలో నెలకొల్పనున్న గ్రంథాలయానికి ఆయన పేరు పెడతామన్నారు. మల్లినాథసూరి కొల్చారంలో జన్మించడం మనకు గర్వకారణమన్నారు. తెలుగు భాషను ఎవరు మర్చిపోకూడదు. కవులు, రచయితలు సమావేశాలలో ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. తెలుగు భాష మరుగున పడిపోతున్న తరుణంలో తెలుగు గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశ్యతో ప్రపంచ తెలుగు మహాసభలను ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ వేదికగా ప్రారంభించారు. సూర్య చంద్రులు ఉన్నన్ని రోజులు తెలుగు ఉంటుంది.. తెలుగు భాషను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కవులు, రచయితలు, కళాకారులపై ఉందన్నారు. ఆయన పుట్టిన స్థలంలో గ్రంథాలయం, స్మృతివనం నెలకొల్పేం దుకు తన నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా ప్రకటించారు. కవి మలినాథ సూరి విగ్రహాన్ని మెదక్, సంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఆవిష్కరించేలా ప్రయత్నిస్తామన్నారు. కానీ నేటికీ ఆ ప్రయత్నం మాత్రంసాగడం లేదు.