మేడ్చల్ మాల్కాజిగిరి,డిసెంబర్21( జనం సాక్షి): జీడిమెట్లలోని వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంటును స్టాండిరగ్ కమిటీతో కలిసి జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..ఇప్పటివరకు ఈ ప్లాంటు ద్వారా 8 లక్షల టన్నుల డెబ్రెస్‌ను తీసుకువచ్చాం.
అందులో రెండు లక్షల టన్నుల డెబ్రెస్‌ను ప్రాసెస్సింగ్ చేశామని తెలిపారు. నగరానికి దక్షణ, ఉత్తర ప్రాంతాల్లో మరో రెండు ఎª`లాంట్లను ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే జీడిమెట్ల ఫతుల్లాగూడ ఎª`లాంట్ల ద్వారా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 15 సర్కిళ్ల నుంచి డెబ్రెస్ సేకరిస్తున్నామని మేయర్ తెలిపారు. త్వరలో మిగతా సర్కిళ్ల నుంచి సేకరిస్తామని స్పష్టం చేశారు.
వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను పరిశీలించినమేయర్