` ముగిసిన శీతాకాల పార్లమెంట్ సమావేశాలు
న్యూఢల్లీి,డిసెంబరు 22(జనంసాక్షి):పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారంతో ముగిసాయి. ఉభయ సభలూ నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ తేదీ కంటే ఒకరోజు ముందే సమావేశాలు ముగియడం విశేషం. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 29న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగా, డిసెంబర్ 23తో ముగియాల్సి ఉన్నాయి. కీలకమైన ఎలక్టోరల్ జాబితాను ఆధార్‌తో అనుసంధానం చేసే బిల్లు మంగళవారం నాడే పార్లమెంటు ఆమోదం పొందింది. బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. గత వర్షాకాల సమావేశాల చివరిరోజు సస్పెండ్ అయిన 12 మంది రాజ్యసభ సభ్యులపై ఈ సమావేశాల చివరివరకూ సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో వారు నిరసనలకే పరిమితమయ్యారు. ప్రతిరోజూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిరసనలు తెలుపుతూ వచ్చిన ఎమ్మెల్యేలకు విపక్షాలు సంఫీుభావం తెలపడం, ఉభయసభల్లోనూ సస్పెన్షన్ ఎత్తివేతకు డిమాండ్ చేయడంతో పలు అవాంతరాలు తలెత్తాయి. మంగళవారంనాడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్‌పై రాజ్యసభలో సస్పెన్షన్ వేటు పడిరది. ఎన్నికల సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డెరెక్ ఓబ్రెయిన్ రాజ్యసభ నియమాల పుస్తకాన్ని విసిరిగొట్టినందుకు ఆయనపై శీతాకాల సమావేశాలు ముగిసేంతవరకూ సస్పెన్షన్ వేటు పడిరది. శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో 18 గంటల 48 నిమిషాల పాటు సభా సమయం వృథా అయినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అయినా కీలకమైన బిల్లుల గురించి చర్చ జరిగిందన్నారు. ఆ బిల్లుకు ఆమోదం కూడా పొందినట్లు ఆయన చెప్పారు. లోక్‌సభలో ఒమిక్రాన్, వాతావరణ మార్పులతో పాటు ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరిగినట్లు ఓం బిర్లా వెల్లడిరచారు.. ఇదే సమయంలో రాజ్యసభను కూడా నిరవధికంగా వాయిదా పడిరది.. శీతాకాల సమావేశాలు అంచనాలకు తగిన రీతిలో జరగలేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు.. నిజానికి ఈ సమావేశాలు మరింత బాగా జరగాల్సి ఉందని, ఎక్కడ తప్పు జరిగిందో సభ్యులో ఆత్మావ లోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29వ తేదీన ప్రారంభం అయిన సంగతి తెలిసిందే కాగా.. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 23వ తేదీ వరకు జరగాల్సి ఉన్నా.. ఒక రోజు ముందే సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు.
పార్లమెంటు నిరవధిక వాయిదా