మంచిర్యాల,డిసెంబర్ 10 జనంసాక్షి: ఉమ్మడి ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 70 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని శశాంక్ గోయల్ సూచించారు.
మంచిర్యాలలో పోలింగ్ పరిశీలించిన శశాంక్ గోయల్