కేంద్రం తీరుతోనే ధాన్యం సేకరణలో ఇక్కట్లు

  


ముందుగానే  అందుబాటులో ఎరువులు

రైతుల సంక్షేమంలో వెనుకంజ లేదు: పల్లా

హైదరాబాద్‌,డిసెంబర్‌7  ( జనం సాక్షి ) : ధాన్యంసేకరణ విషయంలో కేంద్రం తీరు దారుణంగా ఉందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు. ఎఫ్‌సిఐ ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం కారణంగా గోదాముల్లో ధాన్యం నిల్వలు పేరుకు పోయాయని అన్నారు. గతంలో రైతులకు ఎరువుల కొరత ఉండేదని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ఎక్కువ శ్రద్ధ చూపడం వల్ల ముందుగానే ఎరువులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని  అన్నారు. తెలంగాణలో వ్యవసాయపనులకు ఎలాంటి ఆటంకం లేదని, కేంద్రం తీరుతో యాసంగి పంటలకు ముందుగానే అవసరమైన ఎరువులను సిద్దం చేస్తున్నారు. అయితే  ఆరుతడి పంటలతో పాటు, వరికి దూరంగా ఉంటేనే మేలన్నప్రచారం జిల్లాల్లో ఊపందుకుంది. రైతులు ధాన్యాన్ని ఐకేపీ, సొసైటీ సెంటర్లకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు. ఆరబెట్టిన ధాన్యం తీసుకుని మాత్రమే రావాలన్నారు. ఇతర రాష్టాల్ర రైతులు ధాన్యాన్ని మనరాష్ట్రంలో అమ్మేందుకు ప్రయత్నించడం వల్ల గతంలో  మన రైతులకు గిట్టుబాటు ధర అందలేదని, దీనిని నిరోధించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. రైతుకు ముందుగా కావల్సిన విత్తనాలను గ్రామస్థాయిలో ఎవరు అమ్ముతున్నారు. అవి నకిలీవా, మంచివా అనేది కూడా గ్రామస్థాయి రైతు సమాఖ్య సభ్యులు పరిశీలించి రైతులకు తెలియజేయాలన్నారు. రైతు పండిరచిన పంటకు మద్దతు ధర కల్పించేందుకు గ్రామ రైతుబంధు సమితులు రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లకు మోకాలు అడ్డుతున్నా సిఎం కెసిఆర్‌ మాత్రం ధాన్యం కొనుగోళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించి, రైతుల ఆర్థికస్థితిగతులను మెరుగు పర్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు సబ్సిడీ ఎరువులు, విత్తనాలు పొందవచ్చని తెలిపారు. సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పారు. ఉపాధిహావిూ పథకం ద్వారా గ్రామాల్లో  పండ్ల తోటలను పెంచుకోవచ్చని తెలిపారు.  మిషన్‌కాకతీయతో చెరువుల పునరుద్దరణ జరిగిందన్నారు. నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్న సీఎం  కేసీఆర్‌ హావిూని నెరవేర్చడంలో భాగంగా ఇండ్ల నిర్మాణం స్పీడందుకున్నాయన్నారు. త్వరలోనే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి అందజేస్తామన్నారు. ఇండ్ల కేటాయింపు విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం, పైరవీలు, లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా ఇస్తామన్నారు.