హైదరాబాద్‌ సీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌

 

 



` శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇస్తానని ప్రకటన
` డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్‌పైనా దృష్టి పెడతానని వెల్లడి
హైదరాబాద్‌,డిసెంబరు 25(జనంసాక్షి):హైదరాబాద్‌ నగర నూతన పోలీస్‌ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ శనివారం బాధ్యతలు తీసుకున్నారు. శుక్రవరాం రాత్రి జరిగిన బదిలీల్లో ఆయనను నగర పోలీస్‌ కమిషనర్‌గా పక్రబుత్వం నియమించింది. దీంతో ఆయన శనివారం వెంటనే బాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ... ఇక్కడే చదువుకుని, పెరిగి మళ్లీ హైదరాబాద్‌కు సీపీగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పోస్టింగ్‌ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. దేశంలోనే చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ హైదరాబాద్‌ అని, శాంతిభద్రతలు సజావుగా ఉంటేనే అభివృద్ధి సాగుతుందని ఆయన అన్నారు. సైబర్‌ కైమ్స్ర్‌కు చెక్‌ పెట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే మాదకద్రవ్యాల నిరోధానికి కృషి చేస్తానని అన్నారు. మత సామరస్యానికి పేరైన హైదరాబాద్‌లో గతంలోనూ తాను అనేక బాధ్యతలు నిర్వర్తించానని, శాంతిభద్రతలు కాపాడడమే తన ప్రధాన లక్ష్యం అని చెప్పారు. ప్రస్తుతం శాంతిభద్రతలు మంచిగా ఉన్నాయని, దీనిని కొనసాగేలా చూస్తామని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి సమావేశంలో కేసీఆర్‌ శాంతిభద్రతలపైనే మొదటి సమావేశం నిర్వహించారని అన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌ పెట్టారన్నారు. సీసీ టీవీ విజిలెన్స్‌, సాంకేతికత సాయంతో కైమ్స్ర్‌కు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. డ్రగ్స్‌ దందాలను చెక్‌ పెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. సైబర్‌ కైమ్ర్‌ నియంత్రించేందకు ప్రత్యేక నిఘా పెడుతామని సీవీ ఆనంద్‌ చెప్పారు. మెట్రోపాలిటన్‌ సిటీలో శాంతి భద్రతలు చాలా ముఖ్యమని సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉంటున్నారు. మహిళల భద్రత విూద ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. డీసీపీగా 2001 నుంచి పనిచేశాను. అడిషనల్‌ సీపీ ట్రాఫిక్‌గా పనిచేశాను. సైబర్‌ కైమ్ర్‌ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. సైబర్‌ కైమ్ర్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తాము. డ్రగ్స్‌పై అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతాం. మహిళల భద్రత విూద ఎక్కువగా దృష్టి సారిస్తాం. గత నాలుగు సంవత్సరాల నుంచి సెంట్రల్‌ డిప్యుటేషన్‌లో వెళ్లి వచ్చాను. నూతన సంవత్సర వేడుకల విషయంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తాం అని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లు, నాన్‌కేడర్‌ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌ నియమితులు అయ్యారు. ఇక్కడ సీపీగా ఉన్న అంజనీ కుమార్‌.. ఏసీబీ డీజీపీగా ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. సెంట్రల్‌ సర్వీస్‌లో ఉన్న సీవీ ఆనంద్‌ ఈ మధ్యే రాష్ట్ర సర్వీసుకు రిపోర్ట్‌ చేశారు. అందులో భాగంగానే ఆయనకు పోస్టింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఈయన సైబరాబాద్‌ సీపీగా, సివిల్‌ సప్లయ్స్‌ కమిషనర్‌గా పనిచేశారు.