రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
తాజాగా8కి చేరిన కేసుల సంఖ్య
వరంగల్ జిల్లాలో మహిళకు ఒమైక్రాన్ గుర్తింపు
భయాందోళనలు వద్దంటున్న వైద్యారోగ్య శాఖ
థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని వెల్లడి
హైదరాబాద్,డిసెబర్17 (జనంసాక్షి): తెలంగాణలో ఒమైక్రాన్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ ఒమైక్రాన్ కేసులు పెరుగు తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనిమిది ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీనిపై వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు విూడియాతో మాట్లాడుతూ తెలంగాణలో థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటివరకూ ఒమైక్రాన్ సామూహిక వ్యాప్తి లేదన్నారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారిలో ఏడుగురికి ఒమైక్రాన్ ఉన్నట్లు గుర్తించామని, కొత్తగా హనుమకొండలో మహిళకు ఒమైక్రాన్ నిర్థారించామని చెప్పారు. ఒమైక్రాన్ బాధితుల్లో ఎలాంటి లక్షణాలు లేవన్నారు. డెల్టా కంటే 8 రెట్లు ఎక్కువగా ఒమైక్రాన్ వ్యాప్తి ఉంటుందన్నారు. గతంలో కరోనా వచ్చిన వాళ్లకూ ఒమైక్రాన్ వస్తోందని తెలిపారు. రెండు డోస్‌లు తీసుకున్నవారికీ ఒమైక్రాన్ వస్తోందని అన్నారు. కాగా తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని డీహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దని, వైరస్ వల్ల ప్రాణాపాయం లేదని శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తిలేదని చెప్పారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు తొమ్మిదికి చేరాయని వెల్లడిరచారు. ఒమిక్రాన్ బాధితుల్లో 95 శాతం మందిలో లక్షణాలు కనిపించట్లేదని పేర్కొన్నారు. నాన్‌రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఏడుగురికి ఒమిక్రాన్ నిర్దారణ అయిందని చెప్పారు. కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, లాక్‌డౌన్ పెడతారన్న దుష్పచ్రారాలను నమ్మవద్దన్నారు.
దేశంలోని ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరిద్దరే దవాఖానల్లో చేరారని వెల్లడిరచారు. దేశంలో 11 రాష్టాల్ల్రో 88 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. మొత్తం 90 దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఉందని వెల్లడిరచారు. ఈ వేరియంట్ వల్ల ప్రపంచంలో ఒక్క మరణం మాత్రమే నమోదయిందన్నారు. భవిష్యత్‌లో మరో 10 కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మిక్రాన్‌పట్ల అనవసర భయాందోళన అవసరం లేదని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోకపోవడం కూడా ఒమిక్రాన్ వ్యాప్తికి కారణమన్నారు. కొత్త వేరియంట్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని తెలిపారు. లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇంటా బయటా మాస్కు ధరించాలన్నారు. ప్రజలంతా బాధ్యతగా కరోనా నిబంధనలు పాటించాలని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 97 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారని చెప్పారు. 11 జిల్లాల్లో వందశాతం మొదటి డోసు తీసుకున్నారని వెల్లడిరచారు. 56 శాతం మంది రెండు డోసులు వేసుకున్నారని తెలిపారు. ఇదిలావుంటే వరంగల్ జిల్లాలో ఒవిూక్రాన్ కలకలం రేపింది. హనుమకొండకు చెందిన ఓ మహిళకు ఒమైక్రాన్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. విదేశాల నుంచి ఇప్పటి వరకూ వరంగల్‌కు 68 మంది వచ్చారు. వీరిలో 50 మందికి అధికారులు టెస్టులు పూర్తి చేశారు. 49 మందికి నెగెటివ్‌గా నిర్దారణ అయింది. ఒక మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమె శాంపిల్‌ను అధికారులు హైదరాబాద్‌కు పంపారు. ఒమైక్రాన్ పాజిటివ్‌గా అధికారులు నిర్దారించారు. పాజిటివ్ వచ్చిన మహిళ యూకే నుంచి ఈనెల 3న శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు.