కుటుంబాలను పరమార్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్,డిసెంబర్10 జనంసాక్షి: మహబూబ్‌నగర్ గ్రావిూణ మండలం అప్పాయిపల్లి సవిూపంలో గతరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరకద్ర ఎంపీడీవో కార్యాలయంలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మృతుల కుటుంబాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హావిూనిచ్చారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు మంత్రి శ్రద్దాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.రోడ్డుప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చనిపోయిన కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు, గురుకుల విద్యాలయాల్లో వారి పిల్లలకు సీట్లు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.