గిరిజన ప్రాంతాల్లో రాత్రిపూటా వ్యాక్సినేషన్‌

నెలాఖరుకల్లా ప్రక్రియపూర్తి కావాలన్న కలెక్టర్‌

ఆదిలాబాద్‌,డిసెంబర్‌9(జనంసాక్షి ): జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో రాత్రిపూట కూడా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ నెలాఖరు నాటికి వంద శాతం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. అధికారులు, తదితరులతో వ్యాక్సినేషన్‌పై సవిూక్షా సమావేశంలో ఈ సూచనలు చేశారు. ఇదిలావుంటే జిల్లావ్యాప్తంగా రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. బుధవారం 350 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హోంఐసోలేషన్‌లో పది మంది, రిమ్స్‌లో ముగ్గురు చొప్పున చికిత్సకు తరలించినట్లు పేర్కొన్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరోనా వైరస్‌ థర్డ్‌వేవ్‌లో భాగంగా ఒమిక్రాన్‌ వైరస్‌గారూపాంతరం చెంది ప్రజల్లోకి వస్తుందని దీని పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటు భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు తప్పని సరిగా ధరించాలని కోరారు.