విధుల బహిష్కరించిన వీఆర్వోలు

  

అనంతపురం, డిసెంబర్‌3 (జనం సాక్షి)     :  రొద్దం మండలంలోని విఆర్‌ఓ ల సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్‌ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వోలు విధుల బహిష్కరణ చేశారు. గత రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత్రి అయిన సీదిరి అప్పల రాజు వీఆర్వోల పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల విఆర్వోలు విధులను బహిష్కరించారు. మంత్రి విఆర్‌వోలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మంత్రి వెంటనే విఆర్వో లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అలా క్షమాపణలు చెప్పకపోతే నేటి నుండి సచివాలయంలో విధులను నిర్వహించబోమని, నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వినతిపత్రాన్ని తహశీల్దార్‌ ఆనందాచారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విఆర్వోలు పాల్గొన్నారు.