ప్రభాస్‌ కోటి రూపాయల వరదసాయం

  

హైదరాబాద్‌,డిసెంబర్‌7 (జనంసాక్షి): కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో ప్రభాస్‌ ఎప్పుడూ ముందుంటాడు. అభిమానులకు ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా.. ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చాడు ప్రభాస్‌. ఇటీవల ఆంధప్రదేశ్‌లో వరదలు ముంచేత్తిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు జిల్లాలు వరదల దాటికి తీవ్రంగా నష్టపోయాయి. కాలువలు, నదులు పొంగిపోయాయి. చెట్లు, ఇళ్లూ కూలీపోయి ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. వరదల దాటికి నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభాస్‌ ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌?కు రూ. కోటి విరాళం ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన చెక్కును త్వరలోనే సీఎం కార్యాలయానికి పంపనున్నారు.