ప్రత్యామ్నాయ పంటలతో కోతుల బెడద

 


కోతులు, పందుల వల్ల ఇతరత్రా పంటలు అసాధ్యం

తమ భూముల్లో వరితప్ప మరో పంట పండదని వాదన
ఉమ్మడి జిల్లాలో వరిపంటకే మొగ్గుచూపుతున్న రైతులు
నిజామాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి ): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో యాసంగి సీజన్‌లో వరి సాగు
చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పాటు, వ్వయసాయాధికారులు కూడా ఈ మేరకు రైతులను చైతన్యం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిసక్తున్నారు. అయితే రైతులు మాత్రం ఇందుకు సిద్దంగా లేరు. ప్రత్యామ్నాయ పంటలకు ఈ పొలాలు పనికిరావని, కోతుల బాధ కూడా ఉందని అంటున్నారు. వేరుశనగ, శనగ,కంది తదితర పంటలను వేద్దామన్నా కోతుల బెడద తీవ్రంగా ఉందని అంటున్నారు. ఈ భూముల్లో వరికి బదులు వేరే ప్రత్యామ్నాయ పంటలు సాగుచేస్తే కోతులతో సమస్య తలెత్తుతాయన్నారు. గతంలో కూరగాయలతో పాటు ఆరుతడి పంటలను సాగు చేశాం. కోతులు, అడవి పందులు ఆ పంటను పూర్తిగా ధ్వంసం చేయడంతో నష్టం వాటిల్లింది. అదేవిధంగా మా భూములన్నీ తడారని భూములని, ఇందులో వరి తప్ప వేరే పంట వేయడానికి వీలు లేదు. అందుకే వరి పంటనే సాగు చేస్తున్నామని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఆరుతడి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెబుతోంది. కానీ నాకున్న రెండెకరాల భూమిలో వరి పంటకు మాత్రమే అనుకూలంగా ఉంది. ఆరుతడి పంటలు వేస్తే దిగుబడులు రావు. కోతుల బెడద చాలా ఉంటుంది. గతంలో మొక్కజొన్న పంటను సాగు చేశాం. కోతులు, పందుల దాడితో పూర్తిగా పంట దెబ్బతింది. అప్పటి నుంచి వరి పంటనే సాగు చేస్తున్నాను. యాసంగిలో ప్రభుత్వం ధాన్యం కొనకుంటే బయట అమ్ముకుంటామని కూడా కొందరు అన్నారు. ఈ క్రమంలో జిల్లా రైతులు మాత్రం వరి వైపే మొగ్గు చూపుతున్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావచ్చాయి. దీంతో యాసంగి పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లాలో ఎక్కువ శాతం వరి సాగయ్యే నేలలే ఉండడం గత వానాకాలంలో విస్తారంగా వర్షాలు కురువడంతో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలా మారాయి. అదేవిధంగా భూ గర్భజలాలు సైతం చాలానే పెరిగాయి. దీంతో ప్రాజెక్టులు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నారుమళ్లు పోసి ఉంచారు. మరికొన్నిచోట్ల వరి నాట్లు సైతం వేశారు. ఈ యాసంగి సీజన్‌లో అధికశాతం వరి సాగవుతుందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. మరోవైపు యాసంగి పంటల సాగుకు సంబంధించి జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. జిల్లాలో జలవనరులన్నీ నిండుకుండలా ఉన్నాయి. వర్షాకాలంలో కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరుగగా, బోర్లు, బావుల్లో పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉంది. నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో పాటు తడారని ఈ భూముల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం సాధ్యం కాదని రైతులు అంటున్నారు. ఇదే సమయం లో నిజాంసాగర్‌, పోచారం, కౌలాస్‌నాలా ప్రాజెక్ట్‌ల నుంచి నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయకట్టు రైతాంగం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. బావులు,బోర్లు, చెరువుల కింద కూడా వరిపంటనే సాగు చేయడానికి రైతులు సిద్ధం అయ్యారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నారుమళ్లు పోశారు. నారుమళ్లు పోయని వారు వరి సాగుకు సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరి నాట్లు సైతం వేసేశారు. ఈ సారి పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉండడంతో గత ఏడాది యాసంగి కన్న ఎక్కువ విస్తీర్ణంలో నాట్లు వేస్తారని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు డైలామాలో ఉన్నారు. ఏమైనా సరేనని వరినారు మాత్రం పోస్తున్నారు. ఈ భూముల్లో వరి తప్ప వేరే పంట వేయడానికి వీలు లేదు. అందుకే ప్రతీ సీజన్‌ లోనూ వరి పంటనే సాగు చేస్తుంటాం. ప్రభుత్వం వరి వేయవద్దని చెబుతున్నప్పటికీ మాలాంటి భూముల్లో మరో పంట వేయడానికి వీలు లేదు. ఇప్పటికే నారుమళ్లు వేశాం. నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నా మని అన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటే మరిన్ని కష్టాలు కొనితెచ్చుకోవడమే అనిఅంటున్నారు.